అమెరికాకు స్మార్ట్ ఫోన్ లను ఎగుమతి చేయడంలో చైనాను మించిపోయిన భారత్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ సంస్కరణల వల్ల కొనుగోళ్లు పెరిగాయని తెలిపారు. జీఎస్టీ 2.0 ద్వారా ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ పన్ను తగ్గింపులు, ప్రయోజనాలు పొందారు. పండుగ సీజన్‌లో రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరిగాయి. పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా, ఈ ఏడాది భారతదేశం అమెరికాకు మొబైల్ ఫోన్ల ఎగుమతుల్లో చైనాను అధిగమించింది.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు దేశ భవిష్యత్తును మార్చనున్నాయని, వినియోగదారుల కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. జీఎస్టీ 2.0తో ప్రజలు ఆశించిన దానికంటే ఎక్కువ పన్ను తగ్గింపులు చేపట్టామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ధనత్రయోదశి సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు.సెప్టెంబరు 22న తీసుకొచ్చిన సంస్కరణల వల్ల పండుగ సీజన్‌లలో వినియోగదారుల కొనుగోలు శక్తి పెరిగిందని, దసరా సమయంలో ప్రజలు రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరిపారని మంత్రులు తెలిపారు. జీఎస్టీ 2.0 దేశమంతా పండగ వాతావరణాన్ని నెలకొల్పిందని, ఇది ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన దీపావళి కానుక అని పీయూష్ గోయల్ అన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
