ట్రక్కు నిండా కరెన్సీ నోట్లు.. ఒక్కసారిగా గాల్లోకి ఎగరేశాడు
ఓ వ్యక్తి కరెన్సీ నోట్లతో నిండిన ట్రక్కులో నిలబడ్డాడు. రెండు చేతులతో పెద్ద మొత్తంలో డబ్బు ఎత్తి కిందపడేశాడు. అక్కడ ఉన్న వారు మాత్రం ఆ డబ్బును పెద్దగా పట్టించుకోలేదు. రోడ్డు మీద ఒక రూపాయి కనిపించినా ఠక్కున తీసుకుని జేబులో పెట్టుకునే వారున్నారు. అలాంటిది నేలపై కుప్పలు తెప్పలుగా డబ్బు పడుతుంటే ఊరికే ఉంటారా? కానీ వెనిజులాలో చుట్టూ కుప్పలు తెప్పలుగా నోట్లు పడుతున్నా జనం మాత్రం పెద్దగా పట్టించుకోవటం లేదు.
ట్రక్కు నిండా డబ్బులు తెచ్చి రోడ్డుపై చల్లినా జనం మాత్రం తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. వెనిజులా లో ద్రవ్యోల్బణం తీవ్రమై.. డబ్బుకు విలువ లేకుండా పోయింది. చిన్న వస్తువు కొనాలన్నా కట్టల కట్టల డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. తాజాగా సిటీ స్క్వేర్ దగ్గర ఓ వ్యక్తి డబ్బులతో నిండిన ట్రక్కులో నిలబడ్డాడు. రెండు చేతులతో పెద్ద మొత్తంలో నోట్లను పట్టి గాల్లోకి విసిరేశాడు. ట్రక్కు ఉన్న ప్రదేశం చుట్టూ పెద్ద మొత్తంలో నోట్లు పడున్నాయి. జనం మాత్రం వాటిని లెక్కే చేయలేదు. కొంతమంది మాత్రం వాటితో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. వెనిజులా తీవ్ర ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. అక్కడ డబ్బులు చిత్తు కాగితాలతో సమానం అయ్యాయి. ఆహారం, మెడిసిన్స్, ఇంధనం ధరలు ఆకాశాన్ని అంటాయి. అందుకే అక్కడి జనం ఫారెన్ కరెన్సీపై ఆధారపడి బతుకుతున్నారు. యూఎస్ డాలర్లను ఎక్కువగా వాడుతున్నారు. వాటితోటే నిత్యావసర సరుకులు కొంటూ ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సెలెబ్రిటీల వెంట పోకిరీల తంటా.. ఆన్‌లైన్ వేధింపులకు గురైన నటి
పాకిస్తాన్ ను వణికించే విధంగా త్రివిధ దళాల త్రిశూల్ విన్యాసాలు
తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలలో కార్తీక శోభ
