Hamas: హమాస్ చీఫ్ సిన్వర్ బతికే ఉన్నాడా.? ఇజ్రాయెల్‌ కామెంట్స్..

Hamas: హమాస్ చీఫ్ సిన్వర్ బతికే ఉన్నాడా.? ఇజ్రాయెల్‌ కామెంట్స్..

Anil kumar poka

|

Updated on: Oct 13, 2024 | 11:37 AM

ఇజ్రాయెల్ దాడిలో హమాస్ చీఫ్ మృతి చెందలేదా? అతడింకా బతికే ఉన్నాడా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7 దాడుల రూపకర్త, హమాస్ అధినేత అయిన యహ్యా సిన్వర్ సజీవంగానే ఉన్నాడని ఖతర్‌కు చెందిన సీనియర్ దౌత్యవేత్త సోషల్ మీడియాలో పోస్టు పెట్టినట్టు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. అంతేకాదు, ఆయన తనకు రక్షణ కవచంగా ఇజ్రాయెల్ బందీలను

ఇజ్రాయెల్ దాడిలో హమాస్ చీఫ్ మృతి చెందలేదా? అతడింకా బతికే ఉన్నాడా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7 దాడుల రూపకర్త, హమాస్ అధినేత అయిన యహ్యా సిన్వర్ సజీవంగానే ఉన్నాడని ఖతర్‌కు చెందిన సీనియర్ దౌత్యవేత్త సోషల్ మీడియాలో పోస్టు పెట్టినట్టు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. అంతేకాదు, ఆయన తనకు రక్షణ కవచంగా ఇజ్రాయెల్ బందీలను ఉంచుకున్నట్టు ఖతర్ అధికారులు గతంలో పేర్కొన్నారని కూడా ఆయన తన పోస్టులో పేర్కొన్నారని తెలిపింది. దీనిని బట్టి ఖతర్‌తో సిన్వర్ రహస్య సంబంధాలను ఏర్పరచుకుంటున్నట్టు తెలుస్తోందని మీడియా పేర్కొంది.

అక్టోబర్ 7 దాడుల సూత్రధారి అయిన సిన్వర్ ఈ ఏడాది ఆగస్టులో హమాస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. గత నెల 21న హమాస్ కమాండ్ సెంటర్ లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో సిన్వర్ మృతి చెంది ఉంటాడని భావించారు. అయితే, ఈ విషయంలో హమాస్ నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ఇప్పుడు ఖతర్ దౌత్యవేత్త చేసిన పోస్టుతో అతడు బతికే ఉన్నాడని ఇజ్రాయెల్ భావిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.