Viral: తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆడమ్ గ్లాజెవ్స్కీ పోలాండ్‌లో తన ఇంటి కింద భారీ సంపదను పాతిపెట్టారు. 80 ఏళ్ల తర్వాత, అతని మనవడు జాన్ గ్లాజెవ్స్కీ ఆ నిధిని కనుగొన్నారు. 19వ శతాబ్దానికి చెందిన బంగారం, వెండి వస్తువులు మిలియన్ల డాలర్ల విలువ చేస్తూ, కుటుంబ చరిత్రకు నిదర్శనంగా నిలిచాయి.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పోలాండ్‌లో సోవియట్ సైనికుల దాడి నుంచి తన ఆస్తులను రక్షించుకోవడానికి ఆడమ్ గ్లాజెవ్స్కీ ఒక వినూత్న పద్ధతిని అనుసరించారు. 1939లో తన ఇంటిని వదిలి పారిపోవాల్సిన పరిస్థితుల్లో, తన దగ్గర ఉన్న వెండి వస్తువులు, ఆభరణాలను భవనం కింద సెల్లార్‌లో గొయ్యి తీసి పాతిపెట్టారు. యుద్ధానంతరం ఆయన కుమారులు పోలాండ్‌కు తిరిగి వెళ్ళలేకపోయినప్పటికీ, ఆ నిధి అలాగే ఉంటుందని నమ్మారు. ఈ కథ తర్వాతి తరానికి చేరింది. ఒక కుమారుడు తన కొడుకు జాన్ గ్లాజెవ్స్కీకి నిధి ఉన్న ప్రదేశం గురించి చెప్పి, గుర్తుల ఆధారంగా ఒక మ్యాప్‌ను సిద్ధం చేశాడు. ఆ మ్యాప్ ఇటీవల జాన్ గ్లాజెవ్స్కీకి లభించడంతో, అతను పోలాండ్‌లోని తన పూర్వీకుల భవనానికి చేరుకున్నాడు. అక్కడ 91 ఏళ్ల రిటైర్డ్ టీచర్‌తో పాటు స్థానికుల సహాయంతో తవ్వకాలు ప్రారంభించాడు. బాగా లోతుగా తవ్విన తర్వాత, 19వ శతాబ్దానికి చెందిన బంగారం, వెండి పాత్రలు బయటపడ్డాయి. ఈ సంపద ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో మిలియన్ల డాలర్ల విలువ చేస్తోంది. 80 సంవత్సరాల తర్వాత తన తాత పాతిపెట్టిన నిధిని కనుగొనడంతో జాన్ ఆనందానికి అవధులు లేవు.