Gaganyaan: 2040లోగా చంద్రుడిపైకి భారతీయ వ్యోమగామి..! గగన్‌యాన్ మిషన్ పై తాజా రివ్యూ మీటింగ్.
చంద్రయాన్ ను ప్రయోగించడం.. వాటి విజయాన్ని చూసి భారతావని మురిసిపోవడం మర్చిపోలేని ఘట్టం. అలాంటిది మన వ్యోమగామిని చంద్రుడిపైకి పంపిస్తే ఎలా ఉంటుంది? ఆ కలను నిజం చేసే పనిలో ఉంది ప్రభుత్వం. ఈమేరకు ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేశారు. కొన్ని లక్ష్యాలను కూడా నిర్దేశించారు. భారతీయ వ్యోమగామిని 2040లోగా చంద్రుడి మీదకు పంపేందుకు శాస్త్రవేత్తలు ప్రణాళికలు రూపొందించాలన్నారు.
చంద్రయాన్ ను ప్రయోగించడం.. వాటి విజయాన్ని చూసి భారతావని మురిసిపోవడం మర్చిపోలేని ఘట్టం. అలాంటిది మన వ్యోమగామిని చంద్రుడిపైకి పంపిస్తే ఎలా ఉంటుంది? ఆ కలను నిజం చేసే పనిలో ఉంది ప్రభుత్వం. ఈమేరకు ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేశారు. కొన్ని లక్ష్యాలను కూడా నిర్దేశించారు. భారతీయ వ్యోమగామిని 2040లోగా చంద్రుడి మీదకు పంపేందుకు శాస్త్రవేత్తలు ప్రణాళికలు రూపొందించాలన్నారు. 2035లోగా భారతీయ స్పేస్ స్టేషన్‌ను నిర్మించాలని కూడా ఆయన శాస్త్రవేత్తలను కోరారు. దీనికి సంబంధించిన కార్యాచరణను అంతరిక్ష శాఖ డెవలప్ చేస్తుందన్నారు. గగన్‌యాన్ మిషన్ సంసిద్ధతపై తాజాగా రివ్యూ మీటింగ్ జరిగింది. అందులో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 21వ తేదీన ఉదయం ఏడు గంటలకు శ్రీహరికోట నుంచి గగన్‌యాన్ మిషన్‌కు చెందిన మాడ్యూల్ నింగిలోకి దూసుకెళ్లనుంది. భవిష్యత్తు రోదసి కార్యక్రమాల గురించి ప్రధాని మోదీ ఈ సమావేశంలో చర్చించారు. వీనస్ ఆర్బిటార్ మిషన్, మార్స్ ల్యాండర్ గురించి సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..