సైన్యంలోకి కొత్తగా 14 లక్షల మంది.. ఉత్తర కొరియా ఏం చేస్తోంది

|

Oct 21, 2024 | 8:27 PM

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దక్షిణకొరియాతో అనుసంధానం చేసే సరిహద్దులోని రోడ్డు, రైల్వే మార్గాలను ఉత్తర కొరియా ధ్వంసం చేయడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మరోవైపు.. ఒక్క వారం వ్యవధిలోనే 14 లక్షల మంది యువత ఉత్తర కొరియా సైన్యంలో చేరడంతో దాడులు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తర కొరియాలో యుద్ధ వాతావరణం చోటుచేసుకుంది.

లక్షలాది మంది విద్యార్థులు, యూత్‌ లీగ్‌ అధికారులు ఆర్మీలో చేరినట్టు.. మరి కొందరు సర్వీసులోకి తిరిగి వచ్చినట్టు ఆ దేశ మీడియా తెలిపింది. ఒక్క వారంలోనే సైన్యంలో 14 లక్షల మంది యువత చేరినట్టు చెప్పుకొచ్చింది. యువకులు పవిత్ర యుద్ధంలో పోరాడాలని నిర్ణయించుకున్నారని, వారు విప్లవ ఆయుధాలతో శత్రువును నాశనం చేస్తారని తెలిపింది. దీంతో, దక్షిణ కొరియాపై దాడులకు నార్త్‌ కొరియా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. తమ దేశ రాజధానిపైకి దక్షిణ కొరియా డ్రోన్లను పంపుతోందని ఉత్తర కొరియా ఇటీవల ఆరోపించడంతో రెండు దేశాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే దక్షిణకొరియాతో అనుసంధానం చేసే సరిహద్దులోని రోడ్డు, రైల్వే మార్గాలను ఉత్తర కొరియా పేల్చేసింది. ఇక, కిమ్‌ చర్యతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఉత్తర కొరియా చర్యకు కౌంటర్‌గా దక్షిణ కొరియా సైన్యం సరిహద్దు వద్ద హెచ్చరిక కాల్పులు జరిపింది. ఇదే సమయంలో తమ ప్రజల భద్రత ప్రమాదంలో పడితే మాత్రం ఉత్తర కొరియాను తీవ్రంగా శిక్షిస్తామని హెచ్చరించింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దారి దోపిడి.. ఇలా కూడా చేస్తారు.. జాగ్రత్త

రైలు కిటికీ నుంచి జారిపడ్డ చిన్నారి.. ఎక్కడ దొరికిందో తెలుసా ??

మందుబాబు నిర్వాకం.. ఏం జరిగిందో చూడండి

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. క్షణం ఆలస్యం అయ్యుంటే.. రైలు బ్లాస్ట్‌ అయిపోయేదే !!

Adah Sharma: సుశాంత్ ఉరేసుకున్న ఇంటికి షిఫ్ట్ అయిన అదా శర్మ

Follow us on