Food Bank: కెనడా నిర్ణయం భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపనుందా.? వీడియో..

|

Nov 02, 2024 | 7:12 PM

కెనడాలో ఇటీవల జరిగిన పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను పరిమితం చేస్తున్న ట్రూడో సర్కార్.. విదేశీ విద్యార్థుల ఫుడ్‌ బ్యాంక్‌ ల సేవలపైనా కోత పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మొదటి ఏడాది విద్యార్థులకు ఈ సౌలభ్యం కల్పించకూడదని వాంకోవర్‌లోని ఫుడ్‌ బ్యాంకు నిర్ణయించింది. ఆహార ధరలు, నిరుద్యోగం పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

కెనడాలో జీవన వ్యయ భారం భారీగా పెరిగింది. దీంతో అక్కడ ఉచితంగా ఆహారం అందించే ఫుడ్‌ బ్యాంకులపై అంతర్జాతీయ విద్యార్థులు ఆధారపడుతున్నారు. స్థానిక మీడియా ప్రకారం మార్చిలో 20లక్షల మంది ఫుడ్‌ బ్యాంకులను ఆశ్రయించారు. గతేడాదితో పోలిస్తే 6 శాతం పెరగగా.. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. అధిక ద్రవ్యోల్బణం, జీవన వ్యయ ఖర్చులు విపరీతంగా పెరిగాయన్నారు కెనడా ఫుడ్‌ బ్యాంక్స్‌ సీఈవో కిర్‌స్టిన్‌ బియర్డ్‌స్లీ. దీంతో తాము తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.

కెనడాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల జీవన వ్యయ పరిమితిని ప్రభుత్వం ఇటీవల రెట్టింపు చేసింది. 10వేల డాలర్లుగా ఉన్న స్టూడెంట్‌ డిపాజిట్‌ను జనవరి 1 నుంచి 20,635 డాలర్లకు పెంచింది. ఈ నేపథ్యంలో మొదటి ఏడాది విద్యార్థులకు.. ఫుడ్‌ బ్యాంకు సౌలభ్యం దూరం చేయడాన్ని.. ది గ్రేటర్‌ వాంకోవర్‌ ఫుడ్‌ బ్యాంకు సమర్థించుకుంటోంది. ఇటీవల పెంచిన స్టూడెంట్‌ డిపాజిట్‌ను ఈ ఖర్చుల కింద చూడాలని వాదిస్తోంది. ఈ పరిణామంపై అంతర్జాతీయ విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాంకోవర్‌ ఫుడ్‌ బ్యాంక్‌ నిర్ణయం దారుణమని.. కొత్తగా ఇక్కడకు వచ్చే విద్యార్థులకు కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on