మీ భార్య ఎక్కడ ?? ఎలాన్‌ మస్క్‌కు ఊహించని ప్రశ్న !!

|

Sep 21, 2023 | 8:37 PM

టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ కు ఊహించని ప్రశ్న ఎదురైంది. అదీ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ నుంచి. అమెరికా పర్యటనకు వచ్చిన ఎర్డోగాన్‌తో మస్క్‌ భేటీ అయ్యారు. ఈ కార్యక్రమానికి మస్క్‌ తన కుమారుడిని తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే యోగక్షేమాలు ఆరా తీసిన ఎర్డోగాన్‌.. మీ సతీమణి ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. ఊహించని ఈ ప్రశ్నకు మస్క్‌ బదులిస్తూ.. ఆమె ప్రస్తుతం శాన్‌ ఫ్రాన్సిస్కోలో ఉన్నట్లు తెలిపారు. తామిద్దరం విడిపోయామని, అందుకే కుమారుడి సంరక్షణను తానే ఎక్కువగా చూసుకుంటున్నట్లు చెప్పారు.

టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ కు ఊహించని ప్రశ్న ఎదురైంది. అదీ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ నుంచి. అమెరికా పర్యటనకు వచ్చిన ఎర్డోగాన్‌తో మస్క్‌ భేటీ అయ్యారు. ఈ కార్యక్రమానికి మస్క్‌ తన కుమారుడిని తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే యోగక్షేమాలు ఆరా తీసిన ఎర్డోగాన్‌.. మీ సతీమణి ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. ఊహించని ఈ ప్రశ్నకు మస్క్‌ బదులిస్తూ.. ఆమె ప్రస్తుతం శాన్‌ ఫ్రాన్సిస్కోలో ఉన్నట్లు తెలిపారు. తామిద్దరం విడిపోయామని, అందుకే కుమారుడి సంరక్షణను తానే ఎక్కువగా చూసుకుంటున్నట్లు చెప్పారు. కెనడాకు చెందిన గాయని గ్రిమ్స్‌తో ఎలాన్‌ మస్క్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఏఈ ఏ-12, టెక్నో మెకానికస్‌ కుమారులతోపాటు కుమార్తె ఎక్సా డార్క్‌ సిడేరియల్‌ ఉన్నారు. గత సెప్టెంబరులో గ్రిమ్స్‌, ఎలాన్‌ మస్క్‌ విడిపోయిన విషయం తెలిసిందే. తర్వాత ఈ పిల్లలను విడివిడిగా పెంచుకుంటున్నారు. మరోవైపు మస్క్‌తో సమావేశంలో భాగంగా.. టర్కీలో ‘టెస్లా’ కార్ల యూనిట్‌ ఏర్పాటు చేయాల్సిందిగా ఎర్డోగాన్‌ ఆహ్వానించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, స్టార్‌లింక్‌ సేవలపై సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మస్క్‌కు తెలియజేసినట్లు ఓ వార్తాసంస్థ పేర్కొంది. ఎర్డోగాన్‌ ప్రతిపాదనలకు మస్క్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలిపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంబానీ ఇంట గణేష్‌ చతుర్థి వేడుకలు.. సందడి చేసిన స్టార్‌ కపుల్స్‌

నడుచుకెళ్తున్న పిల్లల్ని కారులో డ్రాప్ చేసిన మంత్రి

గుడ్‌ న్యూస్‌.. విమానంలో స్నాక్స్‌తోపాటు కూల్‌డ్రింక్‌ ఫ్రీ

ప‌ట్టప‌గ‌లు బ్యాంక్ దోపిడీ.. రూ.5.56 కోట్లు లూటీ

ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు కలిగిన పురుషుడిగా రికార్డ్‌ !!