యూరప్‌ చుట్టూ డ్రోన్‌ గోడ నిర్మాణం

Updated on: Sep 30, 2025 | 9:15 PM

ఇటీవల నాటో దేశాల గగనతలంలో రష్యా డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. డెన్మార్క్‌ గగనతలంలో కనిపించిన రెండు అనుమానాస్పద రష్యా డ్రోన్లను ఆ దేశం కూల్చేసింది. పుతిన్‌ నిరంతర రెచ్చగొట్టే చర్యలు ఉక్రెయిన్‌ మిత్రదేశాలకు సవాల్‌గా మారింది. ఈ సమస్యలకు పరిష్కారంగా ఉక్రెయిన్‌ సహా కూటమిలో దేశాలు డ్రోన్ వాల్‌ ప్రతిపాదనతో ముందుకొచ్చాయి.

శుక్రవారం బెల్జియం రాజధాని బ్రసెస్‌ల్స్‌లో జరిగిన ఈయూ రక్షణ మంత్రుల వర్చువల్‌ సమావేశం డ్రోన్ వాల్‌ కు ఆమోదం తెలిపింది. పెరిగిపోయిన గగనతల ఉల్లంఘనలపై సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీటిలో కొన్ని ఉల్లంఘనలకు రష్యానే కారణమంటూ దేశాలు నిందించాయి. అయితే, వీటికి తాము కారణం కాదని, తమపై ఆరోపణలు వేయడం సరికాదని రష్యా అంటోంది. సభ్య దేశాల గగనతలంలోకి ప్రవేశించే రష్యా డ్రోన్లు, యుద్ధ విమానాలను కనిపించిన వెంటనే కూల్చేయాలంటూ నాటోకు ఆదేశాలిచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ప్రకటించడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. రష్యా డ్రోన్‌ చొరబాట్లను నివారించేందుకు డ్రోన్‌ వాల్‌ మాత్రమే సరైన పరిష్కారమనే అభిప్రాయానికి తాజాగా ఈయూ మంత్రులు వచ్చారు. మెక్సికో సరిహద్దుల్లో అమెరికా ఓ వాల్ నిర్మించింది. మెక్సికో నుంచి అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు ట్రంప్‌ ఈ గోడ కట్టారు. ఫెన్సింగ్ స్థానంలో స్టీల్, కాంక్రీట్ బ్యారియర్ తో పటిష్టంగా 30 అడుగుల ఎత్తున గోడ నిర్మించారు. అలాగే డ్రోన్‌ వాల్‌ లేదా యాంటీ డ్రోన్ సిస్టం రెండు రకాలుగా పని చేస్తుంది. వాటిలో మొదటిది సాఫ్ట్ కిల్, రెండవది హార్డ్ కిల్. సాఫ్ట్ కిల్ అంటే ప్రత్యర్థి దేశం ఉపయోగించిన డ్రోన్ల సిగ్నల్స్​ను అడ్డుకుని వాటంతటవే టార్గెట్ గుర్తించలేక కూలిపోయే విధంగా చేస్తుంది. మరొకటి హార్డ్​ కిల్ అంటే హై బీమ్ లేజర్ కిరణాలను ఉపయోగించి ఫైరింగ్ చేసి శత్రుదేశం డ్రోన్లను కూల్చివేయటం జరుగుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికా అధ్యక్ష భవనం ఇక బంగారుమయం

నా స్టాప్ వచ్చేసింది.. దిగిపోతున్నా

మన అండమాన్‌లో.. భారీ గ్యాస్ నిక్షేపాలు

మూసారాంబాగ్ బ్రిడ్జి ఉండేది అనుమానమే..

ఇక.. మొబైల్‌ తరహాలో గ్యాస్‌ పోర్టబులిటీ