Gaza: గాజా పై చక్కర్లు కొడుతున్న అమెరికా డ్రోన్లు.. పదుల సంఖ్యలో గాలింపు.. వీడియో.

|

Nov 04, 2023 | 9:03 AM

హమాస్‌ కిడ్నాప్ చేసిన బందీల జాడ తెలుసుకునేందుకు అమెరికా డ్రోన్లు రంగంలోకి దిగాయి. తాజాగా గాజా గగనతలంలో అమెరికా నిఘా డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. బందీలను దాచిన ప్రదేశాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్‌ను సేకరిస్తున్నాయి. దాదాపు వారం క్రితం నుంచే ఇవి గాలింపు చేపట్టాయని ఇజ్రాయెల్‌ అధికారి ఒకరు తెలిపారు. పదుల సంఖ్యలో అమెరికన్లు హమాస్‌ వద్ద బందీలుగా ఉన్నారు.

హమాస్‌ కిడ్నాప్ చేసిన బందీల జాడ తెలుసుకునేందుకు అమెరికా డ్రోన్లు రంగంలోకి దిగాయి. తాజాగా గాజా గగనతలంలో అమెరికా నిఘా డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. బందీలను దాచిన ప్రదేశాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్‌ను సేకరిస్తున్నాయి. దాదాపు వారం క్రితం నుంచే ఇవి గాలింపు చేపట్టాయని ఇజ్రాయెల్‌ అధికారి ఒకరు తెలిపారు. పదుల సంఖ్యలో అమెరికన్లు హమాస్‌ వద్ద బందీలుగా ఉన్నారు. ఇజ్రాయెల్‌కు తమ దేశాన్ని రక్షించుకునే హక్కుందని జోబైడెన్‌ అన్నారు. ఆయన వాషింగ్టన్‌లో చిలీ, డోమినికన్‌ రిపబ్లిక్‌ నాయకులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తనను తాను రక్షించుకొనేందుకు ఇజ్రాయెల్‌ చేసే ప్రయత్నాలకు అమెరికా మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. అదే సమయంలో గాజాలోని ప్రజలకు మానవతా సాయం అందిస్తామని అమెరికా స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. అమెరికా మద్దతు లేకపోతే కొన్ని రోజుల్లోనే ఇజ్రాయెల్‌ ఓడిపోతుందని ఇరాన్‌ అగ్రనేత అయాతుల్లా ఖమేనీ అన్నారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్‌ను యూదు సంస్థతో పోల్చారు. ‘‘యూదు సంస్థ మీకు అబద్ధం చెబుతోంది. అది నిస్సహాయంగా.. గందరగోళంలో ఉంది. అమెరికన్ల మద్దతు లేకపోతే కొన్ని రోజుల్లోనే కుప్పకూలిపోయేది’’ అని తన ట్వీట్‌లో కామెంట్‌ చేసారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.