అదిరిపోయే స్టెప్పులేసిన ట్రంప్.. డ్యాన్స్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మలేషియాలో జరిగిన ఏషియన్ సదస్సుకు హాజరయ్యారు. కోలాలంపూర్‌లో సాంప్రదాయ మలేషియా కళాకారుల స్వాగత నృత్యాలకు అనుగుణంగా ట్రంప్ స్టెప్పులేశారు. తన రెండో దఫా అధ్యక్ష పదవిలో తొలిసారి ఆసియా పర్యటనలో భాగంగా ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మలేషియా పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మలేషియాలో జరిగిన ఏషియన్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ట్రంప్, మలేషియా కళాకారులతో కలిసి స్టెప్పులేశారు. కోలాలంపూర్‌లో ట్రంప్‌కు ఘన స్వాగతం పలికిన మలేషియా సాంప్రదాయ కళాకారులు వారి సంప్రదాయ నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా, కళాకారుల నృత్యాలకు అనుగుణంగా ట్రంప్ కూడా ఉత్సాహంగా స్టెప్పులు వేయడం అందరినీ ఆకట్టుకుంది. ట్రంప్ తన రెండో దఫా అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ఆసియాకు వచ్చారు. మలేషియా ఆతిథ్యం ఇస్తున్న ఈ ఏషియన్ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సదస్సు సందర్భంగా చోటు చేసుకున్న ఈ ప్రత్యేక సంఘటన, ట్రంప్ పర్యటనలో ఒక ప్రధాన హైలైట్‌గా నిలిచింది.
మరిన్ని వీడియోల కోసం :
