Argentina: ‘మిస్సింగ్’ క్రిప్టో మిలియనీర్ హతం.. సూట్‌కేసులో ముక్కలుగా లభ్యం.
రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని కొందరు పిల్లలు ఆడుకుంటున్న సమయంలో ఓ సూట్‌కేసును గుర్తించారు. దగ్గరికి వెళ్లి చూడగా అందులో ఏవో శరీర భాగాలు ఉన్నట్లు గమనించి వెంటనే వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. వారి సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు..అందులో ఓ వ్యక్తి కాళ్లు, చేతులు ఉన్నట్లు గుర్తించారు. మూడురోజుల తర్వాత తలతోపాటు ఇతర భాగాలు లభ్యమయ్యాయి..
అర్జెంటీనాలో ఇటీవల ఆచూకీ లేకుండా పోయిన క్రిప్టో ఇన్‌ఫ్లుయెన్సర్ కథ విషాదాంతమైంది. ఆయన చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, అతడి శరీరం ముక్కలు ముక్కలుగా ఓ సూట్‌కేసులో దొరికింది. స్పెయిన్‌కు చెందిన ఫెర్నాండో పెరెజ్ అల్గాబా అనే వ్యక్తి అర్జెంటీనాకు వచ్చాడు. లగ్జరీ వాహనాలను అద్దెకు ఇవ్వడంతో పాటు క్రిప్టోకరెన్సీ విక్రేతగా పేరున్న అతడు.. లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నట్లు తెలుస్తోంది. అతడికి ఇన్‌స్టాలో సుమారు 10 లక్షల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. అర్జెంటీనాకు వచ్చిన తర్వాత జులై 19 నుంచి ఇతడి ఆచూకీ లేకుండా పోయింది. రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని కొందరు పిల్లలు ఆడుకుంటున్న సమయంలో ఓ సూట్‌కేసును గుర్తించారు. దగ్గరికి వెళ్లి చూడగా అందులో ఏవో శరీర భాగాలు ఉన్నట్లు గమనించి వెంటనే వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. వారి సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. అందులో ఓ వ్యక్తి కాళ్లు, చేతులు ఉన్నట్లు గుర్తించారు. మూడురోజుల తర్వాత తలతోపాటు ఇతర భాగాలు లభ్యమయ్యాయి. వాటికి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడి శరీరంపై ఉన్న టాటూలు, ఫింగర్‌ప్రింట్‌ల ఆధారంగా అవి పెరెజ్ అల్గాబావిగా నిర్ధారించారు. శరీరాన్ని ముక్కలుగా చేసేకంటే ముందే మూడురౌండ్ల బుల్లెట్‌లు దిగినట్లు కనుగొన్నారు. ఓ ప్రొఫెషనల్ కిల్లర్ ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...