Bullet Train: డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే కారణమా?

|

Sep 14, 2024 | 7:09 PM

జపాన్‌ అనగానే మనకు గుర్తొచ్చేది బుల్లెట్‌ రైలు. సురక్షిత ప్రయాణం, సమయపాలనకు పెట్టింది పేరు. శరవేగంగా దూసుకుపోతున్నప్పటికీ వాటిలో ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. 2030 నాటికి అక్కడ డ్రైవర్లు లేకుండా బుల్లెట్‌ ట్రైన్లు నడిపేందుకు చర్యలు చేపడుతున్నారు. తూర్పు జపాన్‌ రైల్వేలో తొలిసారిగా ఇలాంటి ట్రైన్లను ప్రవేశపెట్టనున్నారు.

జపాన్‌ అనగానే మనకు గుర్తొచ్చేది బుల్లెట్‌ రైలు. సురక్షిత ప్రయాణం, సమయపాలనకు పెట్టింది పేరు. శరవేగంగా దూసుకుపోతున్నప్పటికీ వాటిలో ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. 2030 నాటికి అక్కడ డ్రైవర్లు లేకుండా బుల్లెట్‌ ట్రైన్లు నడిపేందుకు చర్యలు చేపడుతున్నారు. తూర్పు జపాన్‌ రైల్వేలో తొలిసారిగా ఇలాంటి ట్రైన్లను ప్రవేశపెట్టనున్నారు. 2028 నాటికి అక్కడ ఒక మార్గంలో నడిచే రైళ్లలో డ్రైవర్‌ సేవలు పూర్తిగా ఆటోమేటెడ్‌ కానున్నాయని.. అయినప్పటికీ డ్రైవర్లు క్యాబిన్‌లోనే అందుబాటులో ఉంటారని ఆ సంస్థ తెలిపింది. 2030 నాటికి పూర్తిస్థాయి డ్రైవర్‌ లెస్‌ ట్రైన్లను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. జపాన్‌లో జనాభా క్షీణిస్తుండటంతో ఇప్పటికే అక్కడి ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలు కార్మికుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇక జపాన్‌లో బుల్లెట్‌ రైలును షింకాన్‌సెన్‌ అని పిలుస్తారు. షింకాన్‌సెన్‌ అంటే జపనీస్‌ భాషలో ‘కొత్త ట్రంక్‌లైన్‌’ అని అర్థం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.