డిన్నర్‌ డేట్‌కి ముగ్గురు బిలియనీర్లు .. ఫొటోలు వైరల్‌

Updated on: Nov 04, 2025 | 10:09 PM

ముగ్గురు సీఈవో బిలియనీర్లు పబ్లిక్‌గా రెస్టరంట్‌లో డిన్నర్‌కు వెళితే ఆ సందడే వేరు. దక్షిణ కొరియాలోని సియోల్‌ లోకల్స్‌కి ఆ అనుభవాన్ని ఎంజాయ్‌ చేసారు. వీడియోలు తీసి వైరల్‌ చేస్తున్నారు. ఆ బిలియనీర్లు కస్టమర్ల బిల్లులు కూడా తామే చెల్లించి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. ఆ బిలియనీర్లు ఎవరో కాదు. ఎన్విడియా సీఈవో జెన్సన్‌ హువాంగ్‌, శాంసంగ్ ఛైర్మన్‌ లీ జే యాంగ్‌, హ్యుందాయ్‌ ఛైర్మన్‌ చుంగ్ యుయి-సన్‌.

వీరి డిన్నర్‌ డేట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దక్షిణ కొరియా లోని జియోంగ్జులో జరుగుతున్న ఏపీఈసీ శిఖరాగ్ర సమావేశం కోసం ఈ ముగ్గురు బిలియనీర్లు వచ్చారు. సియోల్‌లోని క్యాన్‌బు చికెన్‌ రెస్టరంట్‌ వద్ద ఆగారు. వీరిని చూసేందుకు అక్కడి జనం ఎగబడ్డారు. బిలియనీర్లతో ఫొటోల కోసం పోటీ పడ్డారు. రెస్టారెంట్‌లో వీరు చీజ్‌ బాల్స్‌, ఫ్రైడ్ చికెన్‌తో పాటు కొన్ని డ్రింక్స్‌ ఆర్డర్‌ చేసారు. వీరి రాకతో ఆ ప్రాంతంలో సందడిగా మారింది. తమను చూసేందుకు వచ్చిన ప్రజలకు చీజ్‌, ఫ్రైడ్‌ చికెన్‌ను బయటకు వచ్చి అందించారు ఎన్‌విడియా సీఈవో హువాంగ్‌. తరువాత అక్కడ ఉన్న వారితో ముగ్గురు బిలియనీర్లు ముచ్చటించారు. వారికి ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు ఇచ్చారు. రెస్టరంట్‌ నుంచి వెళ్లిపోయే ముందు ఎన్‌విడియా సీఈవో హువాంగ్‌ హోటల్ యజమానులకు బహుమతులు ఇచ్చారు. రెస్టరంట్‌లోని కస్టమర్లు అందరి బిల్లులను తామే చెల్లిస్తామని హువాంగ్‌ ప్రకటించారు. దీంతో అక్కడివారంతా ఆశ్చర్యపోయారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైల్వే టికెట్‌ బుకింగ్‌ విధానంలో మార్పులు

బ్లడ్‌ ఇవ్వండి.. ఓ కప్పు టీ తాగండి

వృద్ధ దంపతుల సాహసం.. ఐదేళ్లు శ్రమించి

గూగుల్‌ క్రోమ్‌ వాడేవారికి కేంద్రం హెచ్చరిక

రక్షణ రంగం ఉత్పత్తులకు కేరాఫ్‌ గా హైదరాబాద్‌