India Border : భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
షేక్ హసీనా ప్రధాన మంత్రిక పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన అనంతరం బంగ్లాదేశ్‌లో హింస చల్లారడం లేదు. హిందువులు, మైనారిటీలే లక్ష్యంగా దాడులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో భారత్‌లో ఆశ్రయం కోసం సరిహద్దులకు బంగ్లాదేశీయులు పోటెత్తుతున్నారు. భారత్-బంగ్లా మధ్య నాలుగు వేల కిలోమీటర్లకు పైగా సరిహద్దు ఉంది. అసోం, బెంగాల్, మేఘాలయ, మిజోరాంతో సరిహద్దులను పంచుకుంటోంది బంగ్లాదేశ్.
షేక్ హసీనా ప్రధాన మంత్రిక పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన అనంతరం బంగ్లాదేశ్‌లో హింస చల్లారడం లేదు. హిందువులు, మైనారిటీలే లక్ష్యంగా దాడులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో భారత్‌లో ఆశ్రయం కోసం సరిహద్దులకు బంగ్లాదేశీయులు పోటెత్తుతున్నారు. భారత్-బంగ్లా మధ్య నాలుగు వేల కిలోమీటర్లకు పైగా సరిహద్దు ఉంది. అసోం, బెంగాల్, మేఘాలయ, మిజోరాంతో సరిహద్దులను పంచుకుంటోంది బంగ్లాదేశ్. దాంతో, బంగ్లా నుంచి ఈ రాష్ట్రాల్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు బంగ్లాదేశీయులు. దాంతో, బోర్డర్‌లో పహారాను మరింత కట్టుదిట్టం చేసింది ఇండియన్ ఆర్మీ.
బంగ్లాదేశ్-అసోం మధ్య 267 కిలోమీటర్ల బోర్డర్ ఉంది. దాంతో, సరిహద్దు వెంబడి సెక్యూరిటీని టైట్ చేసింది బీఎస్‌ఎఫ్. ముఖ్యంగా కరీంగంజ్ ఏరియాలో పహారాను తీవ్రతరం చేశారు. పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి ఔట్‌పోస్ట్‌కు క్యూకడుతున్నారు బంగ్లా దేశీయులు. భారత్‌లోకి అనుమతించాలంటూ బీఎస్‌ఎఫ్ సిబ్బందిని వేడుకుంటున్నారు. అయితే, వాళ్లకు సర్దిచెప్పి బంగ్లా సరిహద్దులకు తిరిగి పంపుతున్నారు బీఎస్‌ఎఫ్ జవాన్లు. సముద్ర మార్గంలో వస్తారనే అనుమానంతో ఒడిశా తీరంలోనూ అలర్ట్ చేసింది ప్రభుత్వం. రెండు దేశాల మధ్య కంచెలు లేని 400 కిలోమీటర్ల మేర బీఎస్‌ఎఫ్ పహారా కాస్తోంది సిలిగురి, జల్‌పాయ్‌గురి చెక్‌పోస్టుల దగ్గరకు జనం చేరుకుంటున్నారు. భారత్‌లో ఆశ్రయం కల్పించాలని బంగ్లదేశీయులు వేడుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.