ఆస్ట్రేలియాలో స్కైడైవర్ కి అనుకోని ప్రమాదం వీడియో

Updated on: Dec 14, 2025 | 9:55 PM

ఆస్ట్రేలియాలో స్కైడైవింగ్ కోసం సిద్ధమవుతున్న ఒక వ్యక్తికి ఊహించని ప్రమాదం ఎదురైంది. 15,000 అడుగుల ఎత్తులో ప్యారాచూట్ విమానం రెక్కకు చిక్కుకోవడంతో కొద్దిసేపు గాల్లోనే వేలాడాడు. తన వద్ద ఉన్న మరో ప్యారాచూట్ సహాయంతో అతను సురక్షితంగా నేలకు దిగాడు. సెప్టెంబర్‌లో జరిగిన ఈ ఘటన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

ఆస్ట్రేలియాలో ఒక స్కైడైవర్‌కు స్కైడైవింగ్ కోసం సిద్ధమవుతున్న సమయంలో అనుకోని ప్రమాదం ఎదురైంది. సుమారు 15,000 అడుగుల ఎత్తులో విమానం నుంచి దూకే క్రమంలో, అతని ప్యారాచూట్ విమానం వెనుక భాగానికి చిక్కుకుపోయింది. దీంతో ఆ స్కైడైవర్ కొద్దిసేపు గాల్లోనే వేలాడుతూ ఉండాల్సి వచ్చింది. ఈ ఘటన అత్యంత ఉత్కంఠభరిత క్షణాలకు దారితీసింది.అయితే, స్కైడైవర్ తన దగ్గర ఉన్న మరో ప్యారాచూట్‌ను ఉపయోగించి చివరికి సురక్షితంగా నేలపైకి దిగ గలిగాడు. అతని సాహసోపేతమైన చర్య వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.

మరిన్ని వీడియోల కోసం :

పాక్‌లో సంస్కృతం కోర్సు వీడియో

రైల్వే సంచలన నిర్ణయం వీడియో

మెస్సీ కోసం హనీమూన్‌ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్‌ వీడియో

వర్క్‌ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్‌ను మళ్లీ తీసుకురండి వీడియో