Sheikh Hasina: భారత్ తో ఇన్నాళ్లు ఏర్పరచుకున్న బంధం బలహీనపడుతోంది
ఢాకాలో హిందువులపై జరుగుతున్న దాడులపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీలపై దాడులు భారత్‌తో బంధాన్ని బలహీనపరుస్తున్నాయని ఆమె అన్నారు. ఇటువంటి అరాచక ఘటనలు బంగ్లాదేశ్‌ను అస్థిరపరుస్తాయని, దేశ విశ్వసనీయతకు భంగం కలిగిస్తాయని హసీనా హెచ్చరించారు.
ఢాకాలో చోటుచేసుకున్న హింసాకాండపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులను ఆమె తీవ్రంగా ఖండించారు. మైనారిటీలపై జరుగుతున్న ఈ అరాచక దాడుల వల్ల పొరుగు దేశాలతో, ముఖ్యంగా భారత్‌తో బంగ్లాదేశ్‌కు ఉన్న సుదీర్ఘ సంబంధాలు బలహీనపడే ప్రమాదం ఉందని షేక్ హసీనా హెచ్చరించారు. హసీనా మాట్లాడుతూ, ఉస్మాన్ హదీ హత్య సంఘటన ఇక్కడ చోటు చేసుకుంటున్న అరాచకానికి పరాకాష్ట అని అభివర్ణించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: మహిళలకు భారీ షాక్.. రాత్రికి రాత్రే పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు
Dubai: నదుల్లా మారిన దుబాయ్ రోడ్లు..
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
