అనారోగ్యంతో గుహలో చిక్కుకుపోయిన అమెరికా అన్వేషకుడు !!

|

Sep 11, 2023 | 7:07 PM

తుర్కియేలోని ఓ గుహలో వెయ్యి మీటర్ల లోతులో అనారోగ్యంతో చిక్కుకుపోయిన అమెరికాకు చెందిన 40 ఏళ్ల మార్క్‌ డికేను సురక్షితంగా బయటికి తీసుకువచ్చేందుకు అంతర్జాతీయంగా ప్రయత్నాలు మొదలయ్యాయి. అంతర్జాతీయ అన్వేషణలో భాగంగా తుర్కియేలోని టారస్‌ పర్వతాల్లో ఉన్న మోర్కా గుహల్లోకి మార్క్‌ డికే వెళ్లారు. మోర్కా గుహ లోతు 1,276 మీటర్లు కాగా, మార్క్‌ డికే 1,120 మీటర్ల లోతులోని బేస్‌క్యాంప్‌లో ఉన్నారు.

తుర్కియేలోని ఓ గుహలో వెయ్యి మీటర్ల లోతులో అనారోగ్యంతో చిక్కుకుపోయిన అమెరికాకు చెందిన 40 ఏళ్ల మార్క్‌ డికేను సురక్షితంగా బయటికి తీసుకువచ్చేందుకు అంతర్జాతీయంగా ప్రయత్నాలు మొదలయ్యాయి. అంతర్జాతీయ అన్వేషణలో భాగంగా తుర్కియేలోని టారస్‌ పర్వతాల్లో ఉన్న మోర్కా గుహల్లోకి మార్క్‌ డికే వెళ్లారు. మోర్కా గుహ లోతు 1,276 మీటర్లు కాగా, మార్క్‌ డికే 1,120 మీటర్ల లోతులోని బేస్‌క్యాంప్‌లో ఉన్నారు. జీర్ణాశయంలో రక్తస్రావం కారణంగా ముందుకు వెళ్ల్లలేని స్థితిలో ఉండిపోయారని యూరోపియన్‌ కేవ్‌ రెస్క్యూ అసోసియేషన్‌ ప్రకటించింది. ఆయనకు అనేక అంతర్జాతీయ గుహాన్వేషణల్లో పాలుపంచుకున్న అనుభవం ఎంతో ఉంది. గుహల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించడంలో స్వయంగా ఆయన సిద్ధహస్తుడని వివరించింది. సాధారణ పరిస్థితుల్లో అనుభవజ్ఞులైన గుహాన్వేషకులకే అక్కడికి వెళ్లేందుకు 15 గంటలు పడుతుందని తెలిపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఊరందరి ముందు భార్య కాళ్లు మొక్కిన భర్త.. ఎందుకంటే ??

Expensive Coin : ప్రపంచంలోనే ఖరీదైన కాయిన్‌.. చూస్తే కళ్లు చెదరాల్సిందే !!

ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయో !! మహిళ ఐడియాకు నెటిజన్లు ఫిదా

అబ్బ.. ఈ కోతి ఎంత మంచిదో !! నెట్టింట వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో

Follow us on