China Balloon: చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన రఫేల్ విమానం.! ఆ సత్తా భారత్ సొంతం.
నిఘా బెలూన్ల కూల్చివేతపై భారత వాయుసేన ప్రత్యేకంగా సాధన చేసింది. అత్యంత ఎత్తులో ఉన్న బెలూన్ను కూల్చే ఈ ఆపరేషన్లో రఫేల్ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. దీనిలో ఉపయోగించిన బెలూన్లకు పేలోడ్ను కూడా అమర్చారు. దానిని దాదాపు 55 వేల అడుగుల ఎత్తులో ఒక క్షిపణిని ప్రయోగించి కూల్చేశారు. దీంతో గగనతలంలో నిదానంగా కదిలే భారీ టార్గెట్లను కూడా కూల్చేసే సత్తా భారత్కు ఉన్నట్లు తేలింది.
నిఘా బెలూన్ల కూల్చివేతపై భారత వాయుసేన ప్రత్యేకంగా సాధన చేసింది. అత్యంత ఎత్తులో ఉన్న బెలూన్ను కూల్చే ఈ ఆపరేషన్లో రఫేల్ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. దీనిలో ఉపయోగించిన బెలూన్లకు పేలోడ్ను కూడా అమర్చారు. దానిని దాదాపు 55 వేల అడుగుల ఎత్తులో ఒక క్షిపణిని ప్రయోగించి కూల్చేశారు. దీంతో గగనతలంలో నిదానంగా కదిలే భారీ టార్గెట్లను కూడా కూల్చేసే సత్తా భారత్కు ఉన్నట్లు తేలింది. పొరుగు దేశాలపై నిఘా వేయడానికి చైనా ప్రత్యేకమైన బెలూన్లను వినియోగిస్తుంది. తాజాగా ఇటువంటి బెలూన్లను కూల్చివేసే అంశంపై భారత వాయుసేన తీవ్రంగా సాధన చేసింది. దాదాపు 15 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న వస్తువును కూల్చడంపై కొన్ని నెలల క్రితం తూర్పు ఎయిర్ కమాండ్లో శిక్షణా కార్యక్రమం జరిగినట్లు ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది.
2023లో చైనా ప్రయోగించిన ఓ బెలూన్ అమెరికాలోని దక్షిణ కరోలినా గగనతలంలో ప్రత్యక్షమై సంచలనం సృష్టించింది. నాడు అమెరికా యుద్ధ విమానం ఎఫ్-22 సాయంతో దాన్ని కూల్చివేశారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల గగనతలాలపై ఇటువంటి బెలూన్లు కనిపించినట్లు వార్తలొచ్చాయి. భారత్లో కూడా త్రివిధ దళాల కమాండ్ ఉన్న అండమాన్ నికోబార్ దీవులపై ఇలాంటివి కనిపించాయి. దాదాపు నాలుగు రోజుల తర్వాత అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ బెలూన్లపై ప్రత్యేకమైన పరికరాలున్నట్లు అనుమానిస్తున్నారు. కొన్నింటిపై ప్రత్యేకమైన స్టీరింగ్ వ్యవస్థలు ఉండటంతో కీలక ప్రాంతాల గగనతలంలోనే వాటిని కొన్ని రోజులపాటు తిప్పే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.