Wetland virus: చైనాలో కొత్త రకం వైరస్‌.. ఈసారి డైరెక్ట్‌ గా అది డేమేజ్ అవుతుంది.!

|

Sep 12, 2024 | 5:40 PM

గత నాలుగేళ్ల క్రితం చైనా నుంచి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రభావం నుంచి పూర్తిగా ఇప్పటికీ ప్రపంచం కోలుకోలేదు. ఇంకా చెప్పాలంటే చైనాలో పుట్టి యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేసిన కరోనా మహమ్మారిని పూర్తిగా మరచిపోకముందే.. మళ్ళీ డ్రాగన్ కంట్రీలో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కొత్త వైరస్ మెదడుపై దాడి చేస్తుందని సమాచారం.

చైనాలో మరో కొత్త రకం వైరస్‌ మళ్ళీ వ్యాపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జంతువులలోని రక్తాన్ని పీల్చే కీటకాల ద్వారా మనుషులకు వ్యాపించే వైట్‌ల్యాండ్ (WLEV) అనే వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ మెదడు, నరాల సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని చెప్పారు. చైనాలోని జింజౌ ప్రావిన్స్‌లో 2019లోనే బయటపడిన ఈ వైరస్‌ను వెట్‌ల్యాండ్‌ వైరస్‌ (వెల్వ్‌)గా పేర్కొంటున్నారు. 2019లో 61 ఏళ్ల జిన్‌జియాంగ్‌ అనే వృద్ధిలో తొలిసారిగా ఈ వైరస్‌ను గుర్తించారు. మంగోలియాలోని వరి పొలంలో అతను పరాన్నజీవుల కాటుతో అనారోగ్యం బారిన పడ్డాడు. అప్పుడు జిన్‌జియాంగ్‌ వెట్‌ల్యాండ్ వైరస్ సోకినట్లు గుర్తించారు. ఐదు రోజుల పాటు, అతను జ్వరం, తలనొప్పి ,వాంతులు వంటి లక్షణాలతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో మరిన్ని జీవులను పరీక్షించారు. 2 శాతం పరాన్నజీవులు WLV జన్యు పదార్ధాలను కలిగి ఉన్నాయని కనుగొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on