Viral Video: ఓర్నీ ఇదేం మాస్ ఐడియా గురు..! డ్రంక్‌డ్రైవ్ కేసుకు భయపడి..డెత్‌సర్టిఫికెట్ తెచ్చుకుంది..!(వీడియో)
జో బెర్నాడ్ అనే మహిళ 2019వ సంవత్సరంలో మద్యం సేవించి వాహనాన్ని నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కింది. ఆ సమయంలో ఆమె డ్రైవింగ్ లైసెన్స్‌పై సుమారు 18 నెలల పాటు నిషేధం పడింది. అయితే అదేం పట్టించుకోకుండా.. ఈమె మళ్లీ డ్రైవింగ్ చేస్తూనే ఉంది. ఇక 2020లో
జో బెర్నాడ్ అనే మహిళ 2019వ సంవత్సరంలో మద్యం సేవించి వాహనాన్ని నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కింది. ఆ సమయంలో ఆమె డ్రైవింగ్ లైసెన్స్‌పై సుమారు 18 నెలల పాటు నిషేధం పడింది. అయితే అదేం పట్టించుకోకుండా.. ఈమె మళ్లీ డ్రైవింగ్ చేస్తూనే ఉంది. ఇక 2020లో ఆమె మరోసారి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి పోలీసులకు దొరికింది. సదరు ఇన్సిడెంట్ గురించి ఆమెను విచారించేందుకు పోలీసులు జో ఇంటికి వెళ్లగా.. జో బెర్నార్డ్ తన చెల్లి అని.. ఆమెకు జబ్బు చేసి కొద్దిరోజుల క్రితం మృతి చెందిందని చెప్పింది. పోలీసులు అది నమ్మి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అలా సుమారు ఓ నెల రోజుల పాటు అందరికి తాను చనిపోయానని నమ్మించిన జో బెర్నార్డ్.. అందుకు అనుగుణంగా ఓ ఫేక్ డెత్ సర్టిఫికేట్‌ను సైతం సృష్టించింది. ఇక అదే ఆమెకు శాపమైంది. కోర్టుకు సబ్మిట్ చేయడంలో అది ఫేక్ అని తేలడంతో అసలు నిజం బయటపడింది. చేసిన తప్పుకు కోర్టు జో బెర్నార్డ్‌ను మందలించడంతో పాటు 8 నెలల శిక్ష కూడా విధించింది. కాగా, జో బెర్నార్డ్ 2019లో ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి జైలుకి వెళ్లగా.. 2020లో అదే తప్పును రిపీట్ చేసి అడ్డంగా దొరికింది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..