Viral: కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

|

Dec 28, 2024 | 7:33 PM

కజకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం కజకిస్థాన్‌లోని అక్టౌ నగరానికి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు మృతిచెందినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ 10 మంది ప్రాణాలతో బయటపడినట్టు సమాచారం. ప్రమాద సమయంలో విమానంలో 72 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.

వివరాల ప్రకారం రిపబ్లిక్‌ చెచెన్యా రాజధాని గ్రోజ్నీ వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. గ్రోజ్నీలోని దట్టమైన మంచు కారణంగా దానిని దారి మళ్లించారు. ఈ క్రమంలోనే అక్టౌ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ఈ ప్రమాదానికి ముందు ఎయిర్‌పోర్ట్‌పైన విమానం పలుమార్లు గిరగిరా తిరిగి, నేల కూలిందని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. దాంతో మంటలు చెలరేగాయి. ఈ దృశ్యాలు నెట్టింట్లో వెలుగులోకి వచ్చాయి. విమానం అక్తౌ నగరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. విమానం ఎయిర్‌పోర్టుపై చక్కర్లు కొడుతూ ఒక్కసారిగా భూమిని ఢీకొట్టడంతో వెంటనే మంటలు వ్యాపించాయి. విమాన ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఘటనా స్థలంలో 52 ఫైర్‌ టెండర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. మరోవైపు.. ప్రయాణికుల గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ప్రమాదానికి ముందు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కోసం పైలట్‌ రిక్వెస్ట్‌ పంపినట్టు సమాచారం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.