Bulding Climber: ఎం టాలెంట్ రా నాయన..! ఆకాశహర్య్మాన్ని అవలీలగా ఎక్కి.. చూసే వాళ్ళకి చెమటలు పట్టించాడు..
ఆకాశాన్నంటే భవంతులు ఆకాశహర్య్మాలకు నగరంగా పారిస్ ప్రసిద్ధి చెందింది. కాగా అంతెత్తు ఉన్న భవంతుల్నిఈజీగా అధిరోహించి అభినవ సూపర్‌మాన్‌గా పేరు గడించాడు పారిస్‌కే చెందిన అలెక్సిస్ లాండోట్.
ఆకాశాన్నంటే భవంతులు ఆకాశహర్య్మాలకు నగరంగా పారిస్ ప్రసిద్ధి చెందింది. కాగా అంతెత్తు ఉన్న భవంతుల్నిఈజీగా అధిరోహించి అభినవ సూపర్‌మాన్‌గా పేరు గడించాడు పారిస్‌కే చెందిన అలెక్సిస్ లాండోట్. తాజాగా ఈ యువ సాహసికుడు మరో అద్భుతం చేశాడు. తాళ్లు కానీ సేఫ్టీ నెట్ సాయం లేకుండా ప్రాణాలకు తెగించి సైతం భవంతిపైకి ఎక్కడం చేస్తుంటాడు. ఇలాంటి వారిని “ఫ్రీ సోలో” క్లైంబర్ అని పిలుస్తారు. అంతేకాదు ప్రపంచంలోని ఏకైక ఫ్రీ సోలో” క్లైంబర్ అలెక్సిస్ కాగా.. తాజాగా 122 మీటర్ల ఎత్తున్న మెర్క్యురియల్స్ టవర్‌ను అధిరోహించాడు. గతంలో లా డిఫెన్స్ ఇంకా మోంట్‌పర్నాసె టవర్లను ఎక్కిన అలెక్సిస్ ఆ రెండిటి కన్నా ఈ టవర్ ఎక్కడం కాస్త కష్టంగా ఉందని తెలియజేశాడు. తన జీవితం తన అదుపులో ఉందని తెలిసి కలిగే ఫీలింగ్ ఇట్స్ అమేజింగ్ అంటూ కామెంట్ చేశాడు. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా రిస్క్ తీసుకుని టవర్లు ఎక్కడంలో మరెక్కడా లేని థ్రిల్ ఉందని తెలిపాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..