మస్క్ టీమ్‌లో మన కుర్రాడు.. వైరల్ అవుతున్న ఆకాశ్ బొబ్బ పేరు
డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ శాఖను ఏర్పాటుచేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ శాఖ.. వృథా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా పని చేస్తుంది. ఈ బాధ్యతలను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు అప్పగించారు ట్రంప్. తాజాగా ఈ విభాగం ఆరుగురు యువ ఇంజినీర్లను విధుల్లోకి తీసుకుంది.
వీరిలో భారత సంతతికి చెందిన ఆకాశ్ బొబ్బ కూడా ఉన్నాడు. దీంతో అతడి పేరు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. డోజ్ నియమించుకున్న ఆరుగురు కూడా 19 నుంచి 24 ఏళ్ల లోపు వయసు వారేనని ఓ అంతర్జాతీయ కథనం తెలిపింది. వీరిలో కొందరు ఈ మధ్యే కాలేజీ విద్యను పూర్తి చేసుకోగా.. ఒకరు ఇంకా చదువుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాలనా వ్యవహారాలకు సంబంధించిన ఎలాంటి అనుభవం లేని వీరిని డోజ్ ఉద్యోగులుగా నియమించడం అగ్రరాజ్యంలో చర్చనీయాంశంగా మారింది. అమెరికా ప్రభుత్వానికి సంబంధించి సున్నితమైన డేటాను తెలుసుకునేందుకు డోజ్‌కు అనుమతి ఉన్న నేపథ్యంలో ఈ యువ ఉద్యోగుల నియామకాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెరుగైన చికిత్స కోసం విదేశాలకు శ్రీతేజ్! బన్నీవాసు కీలక నిర్ణయం
Samantha: సమంతతో ఆ డైరెక్టర్.. డేటింగ్ నిజమేనా?
ముద్దు కాదు కదా.. స్లీవ్ లెస్ డ్రెస్ కూడా వేయదు..
స్టార్ కొరియోగ్రాఫర్ దారుణం.. డ్రగ్స్ ఇచ్చి బాలికను గర్భవతిని చేశాడని ఆరోపణలు
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

