ATA Celebrations 2022: భారతదేశం గర్వించే స్థితికి తెలుగు ప్రజలు.. ఆటా అంటే ఆంధ్ర తెలంగాణ అసోసియేషన్..
ATA Celebrations 2022: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ వేదికగా అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వాషింగ్టన్ డీసీలోని సువిశాలమైన వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్...
ఆటా మహాసభల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ ను ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను ఈ పెవిలియన్ లో ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి టీఆర్ ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆటా వేదికగా ప్రచారం చేస్తున్న నిర్వాహకులను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. ఈ క్రమంలో రచయిత ప్రభావతి రాసిన బతుకమ్మ ప్రత్యేక సంచికను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు.ఆటా అంటే ఆంధ్ర తెలంగాణ అసోసియేషన్ గా ఎమ్మెల్పీ కవిత అభివర్ణించారు. ఒకప్పుడు భారతదేశంలో తెలుగువారికి ఎన్టీ రామారావు గుర్తింపు తెచ్చారన్న ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ వారికి భారతదేశంలో కేసీఆర్ గారు గుర్తింపు తెచ్చారన్నారు. అదే విధంగా అమెరికాలో తెలుగువారికి ఆటా గుర్తింపు తెచ్చిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. మహాసభల ద్వారా తెలుగు సంస్కృతిని ముందు తరాలకు తెలియజెప్పేందుకు ఆటా ప్రతినిధులు చేస్తున్న కృషిని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. భారతదేశం గర్వించే స్థితికి అమెరికాలోని తెలుగువారు ఎదిగారని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?