అమెరికాలో తల్లిదండ్రులకు దూరం కానున్న భారత సంతతి పిల్లలు !!
అమెరికాలో తాత్కాలిక వీసాతో ఉంటున్న భారత సంతతి తల్లిదండ్రులు తమ పిల్లలకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. హెచ్ 1 బీ వీసాతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారు ఈ ముప్పును ఎదుర్కొంటున్నారు. ఈ వీసా హోల్డర్ల పిల్లలకు అమెరికా హెచ్ 4 వీసా జారీ చేస్తుంది. వారు 21 ఏళ్లు వచ్చే వరకు అమెరికాలో తల్లిదండ్రులతో కలిసి ఉండవచ్చు. ఈ లోపు గ్రీన్ కార్డ్ వస్తే శాశ్వతంగా నివసించే హక్కు లభిస్తుంది. లేదంటే అమెరికా వదిలి వెళ్లాల్సి ఉంటుంది.
అమెరికాలో తాత్కాలిక వీసాతో ఉంటున్న భారత సంతతి తల్లిదండ్రులు తమ పిల్లలకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. హెచ్ 1 బీ వీసాతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారు ఈ ముప్పును ఎదుర్కొంటున్నారు. ఈ వీసా హోల్డర్ల పిల్లలకు అమెరికా హెచ్ 4 వీసా జారీ చేస్తుంది. వారు 21 ఏళ్లు వచ్చే వరకు అమెరికాలో తల్లిదండ్రులతో కలిసి ఉండవచ్చు. ఈ లోపు గ్రీన్ కార్డ్ వస్తే శాశ్వతంగా నివసించే హక్కు లభిస్తుంది. లేదంటే అమెరికా వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం హెచ్ 4 వీసా ప్రాసెసింగ్ కు వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువగా ఉందని అమెరికాలోని భారత సంతతి తల్లిదండ్రులు చెబుతున్నారు. హెచ్ 1 బీ వీసాతో అమెరికాలో పనిచేస్తున్న భారతీయుల సంఖ్య లక్షల్లో ఉందని ఇమిగ్రేషన్ అధికారులు తెలిపారు. వారితో పాటు హెచ్ 4 వీసాతో ఉంటున్న పిల్లలు కూడా అదే సంఖ్యలో ఉంటారని అంచనా వేశారు. ఇందులో 21 ఏళ్లకు చేరువైన యువత 1.34 లక్షల మంది, కాగా ప్రస్తుతం వీరంతా డిపోర్టేషన్ ముప్పు ఎదుర్కొంటున్నారు. అమెరికాలో ఇప్పుడున్న నిబంధనల ప్రకారం వీరందరికీ గ్రీన్ కార్డు రావాలంటే కనీసం 135 ఏళ్లు పడుతుందని అంచనా. దీనిపై గతకొంతకాలంగా అమెరికాలో ఆందోళనలు జరుగుతున్నాయి. భారత సంతతి యువతతో పాటు ఇతర దేశాలకు చెందిన యువత కూడా ఈ సమస్యపై ఆందోళన చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మియామీ తీరంలో అలలపై తేలియాడిన ట్రంప్ కూతురు ఇవాంక
ఇంజిన్ లేకుండానే కదిలిన రైలు !! ఆశ్చర్యంలో రైల్వే అధికారులు
ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై అఘాయిత్యం.. ఆపై అమ్మేసిన పోలీసులు
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

