రోడ్డుపై నడుస్తున్న మహిళ ముందు పడ్డ పొట్లం..ఆ తర్వాత! వీడియో
ఖమ్మం జిల్లాలో రోడ్డుపై నడుస్తున్న ఓ మహిళకు దుండగులు కొత్త తరహాలో మోసం చేశారు. మహిళ ముందు పొట్లం విసిరి, అందులో బంగారం బిస్కెట్ ఉందని నమ్మించి, ఆమె మెడలోని బంగారు గొలుసు, నగదు తీసుకుని ఉడాయించారు. నకిలీ బంగారం అని తెలియడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
ఖమ్మం జిల్లాలో కొత్త తరహా బంగారు మోసం వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై నడుస్తున్న ఓ మహిళను టార్గెట్ చేసి, కేటుగాళ్లు పక్కా ప్రణాళికతో ఆమెను మోసగించారు. సెప్టెంబర్ 20న బోసుబొమ్మ సెంటర్ నివాసి అయిన 55 ఏళ్ల మహిళ గాంధీ చౌక్ వద్దకు రాగానే, ఆమెను అనుసరిస్తున్న మరో మహిళ ఆమె ముందుకు ఓ పొట్లాన్ని విసిరింది. ఆ పొట్లంలో బంగారం బిస్కెట్ ఉందని చెప్పి, దాన్ని పంచుకుందామని నమ్మబలికింది.ఇంతలో అక్కడికి వచ్చిన మరో వ్యక్తి, ఆ బంగారం బిస్కెట్ విలువ పది లక్షలకు పైనే ఉంటుందని చెప్పాడు. దీనితో మోసగాళ్లు ఆ మహిళను బంగారం బిస్కెట్ మొత్తం తీసుకోమని, బదులుగా ఐదు లక్షలు ఇవ్వాలని కోరారు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
