విజయవాడ భవానిపురంలో దారుణం
విజయవాడ భవానీపురంలో ఒక యువతిపై కత్తితో దాడి జరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారం తెలియాల్సి ఉంది. విజయవాడ భవానీపురంలోని ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డులో ఒక యువతిపై కత్తితో దాడి జరిగింది.
విజయవాడ భవానీపురంలోని ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డులో ఒక యువతిపై కత్తితో దాడి జరిగింది. ఒక అగంతకుడు కత్తితో ఆమె గొంతు కోయడంతో ఆమె రక్తంతో పరిగెత్తుతూ వెళ్లి రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. పోలీసులు దాడి చేసిన వ్యక్తిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Batthula Prabhakar: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కోసం కొనసాగుతున్న వేట
Guntur Cholera Cases: గుంటూరు జిల్లాలో 7కి చేరిన కలరా కేసులు
AP Assembly 2025: PPP విధానంపై తగ్గేదే లేదంటున్న ఏపీ ప్రభుత్వం
