Hyderabad: తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న మహిళతో జాయింట్ కమిషనర్‌ బాగోతం.. భార్య వెళ్లి..

Updated on: Feb 21, 2025 | 2:01 PM

వేరే మహిళతో సహజీవనం చేస్తోన్న భర్తను చితక్కొట్టింది భార్య.GHMC అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు జానకిరామ్‌. వేరే మహిళతో మరో ఇంట్లో ఉండగా ఆయన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది భార్య కళ్యాణి. రోజుల తరబడి భర్త ఇంటికి రాకపోవడంతో.. నిఘా పెట్టి భర్తను పట్టుకుంది భార్య. ఆ తర్వాత ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

GHMC అడ్మిన్‌లో జాయింట్‌ కమిషనర్‌‌గా పనిచేస్తున్న జానకిరామ్‌ తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న మహిళతో సంబంధం పెట్టుకొని వేరే చోట ఉంటున్నారనేది భార్య ఆరోపణ. సికింద్రాబాద్‌ వారాసిగూడలో వాళ్లు ఉంటున్నట్టు తెలుసుకుని.. బంధువులతో నేరుగా ఇంటికి వెళ్లి దాడి చేసింది. జానకిరామ్‌తోపాటు ఆయనతో ఉంటున్న మహిళకు తీవ్రమైన గాయాలు అవడంతో పోలీసులు వాళ్లను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

గతంలో మెదక్ మున్సిపల్‌ కమిషనర్‌గా పని చేశారు జానకిరామ్.. మొదటి భార్య చనిపోవడంతో ఆరేళ్ల కిందట కల్యాణిని రెండో పెళ్లి చేసుకున్నారు. 4 నెలలుగా ఆమెను దూరం పెట్టి మరో మహిళతో సహజీవనం చేస్తున్నారు. ఇది తెలిసే ఇవాళ అక్కడకు వెళ్లి పంచాయితీ పెట్టారు. ఆగ్రహంతో వాళ్లిదరిపైనా దాడి చేశారు.. ఈ విషయంపై PSలో కంప్లైంట్‌ ఇవ్వలేదు.. జానకిరామ్ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.