AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏజ్ 40 ప్లస్.. పెళ్లిపై మాత్రం నో రెస్పాన్స్

ఏజ్ 40 ప్లస్.. పెళ్లిపై మాత్రం నో రెస్పాన్స్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 28, 2026 | 7:35 PM

Share

టాలీవుడ్‌లో పలువురు సీనియర్ హీరోయిన్లు 40 ఏళ్లు దాటినా పెళ్లికి దూరంగానే ఉంటున్నారు. శృతి హాసన్ తాజాగా పెళ్లి ప్రశ్నలపై స్పందిస్తూ అలాంటి ప్రశ్నలు ఆపాలని కోరగా, అనుష్క, త్రిష, తమన్నా కూడా ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టి పెట్టారు. వ్యక్తిగత నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తూ తమ తమ ప్రొఫెషనల్ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలంటారు కదా.. కానీ మన హీరోయిన్లు మాత్రం దానికి దూరంగానే ఉంటున్నారు. వయసు పెరుగుతున్నా పెళ్లిపై మాత్రం నో కామెంట్స్ అంటున్నారు. 40 ప్లస్‌లో కూడా ప్లీజ్ మాకు అప్పుడే పెళ్లేంటి అంటున్నారు. ఒక్కరో ఇద్దరో కాదు.. ప్రతీ సీనియర్ హీరోయిన్ కూడా పెళ్లి అంటేనే కిలోమీటర్ పారిపోతున్నారు. అసలేంటిది..? పెళ్లి విషయంలో మన హీరోయిన్ల తీరు ఒక్కొక్కరిదీ ఒక్కోలా ఉంది. కొందరు 20ల్లో ఉన్నపుడే పెళ్లి చేసుకుంటున్నారు.. దాంతో పాటే కెరీర్‌లో బిజీగా ఉన్నారు. కియారా అద్వానీ, రష్మిక, అలియా భట్ వీళ్లంతా త్వరగానే పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ మరో బ్యాచ్ కూడా ఉంది.. వాళ్లకు 40 ఏళ్లు వచ్చినా కెరీర్‌పై ఫోకస్ పెడుతున్నారే కానీ పెళ్లికి మాత్రం నో అంటున్నారు. తాజాగా శృతి హాసన్ పెళ్లిపై రియాక్ట్ అయ్యారు. తన కెరీర్ 17 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇన్‌స్టాలో Q & A చేసారు. అందులో పెళ్లి గురించి అడిగితే.. తన 17 ఏళ్ళ కెరీర్‌లో 15 ఏళ్ల నుంచి ఇదే ప్రశ్న వింటున్నానని.. ఈ ప్రశ్న అడగడం ఆపాలని చెప్పారు శృతి. ఈ లెక్కన ఇప్పట్లో ఈమెకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని అర్థమవుతుంది. కేవలం శృతి హాసన్ మాత్రమే కాదు.. అనుష్క, త్రిష లాంటి సీనియర్ హీరోయిన్లు కూడా ఇంకా పెళ్లికి దూరంగానే ఉన్నారు. వయసు నాలుగు పదులు దాటేసినా ఇంకా కెరీర్ మీదే ఫోకస్ పెడుతున్నారు తప్ప మూడు ముళ్లపై ఏ ఆలోచన చేయట్లేదు. తమన్నా సైతం 40కి చేరువవుతున్నా నో మ్యారేజ్ అంటున్నారు. మొత్తానికి ఈ సీనియర్లంతా శ్రీమతులుగా మారే సమయమెపుడో మరి..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాట్‌ ఏన్‌ ఐడియా టీచర్ జీ.. అగ్గిపెట్టెలతో అటెండెన్సా!

లక్ష ఇస్తే.. 2 లక్షలు చేస్తాం.. మాయా లేదు మంత్రం లేదు!

Viral Video: ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల

మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు

తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..

Follow Us