ఎవరీ బౌన్సర్లు.. అసలు వారిని అలాపెట్టుకోవచ్చా ??
బౌన్సర్లంటే ఎవరు? వారిని ఎవరు నియమించుకుంటారు? బౌన్సర్ల లేదా బాడీగార్డుల నియామకంలో ఉన్న నియమ, నిబంధనలు ఏంటి?తాజాగా మోహన్ బాబు ఇంటిగుట్టు రచ్చకెక్కిన తర్వాత.. వాళ్ల ఇంటి దగ్గర జరిగిన పరిణామాల దృష్ట్యా బౌన్సర్ల గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు బౌన్సర్లంటే ఎవరు..? వాళ్ల నియామకాలు అధికారకమేనా...? వాళ్లకుండే అధికారాలేంటి..?
ఎవరు బౌన్సర్లను పెట్టుకోవచ్చు.. ఎవరు పెట్టుకోకూడదు… తదితర డీటైల్స్ ఇప్పుడు చూద్దాం. బౌన్సర్లంటే.. క్లబ్, పబ్ వంటి ప్రవేశ ద్వారాల వద్ద నిల్చుని సెక్యూరిటీ అందించే వ్యక్తులు. లోపలికి వెళ్లకూడని వ్యక్తులను, ఘర్షణలకు కారణమయ్యే వారిని బయటే ఆపేయడానికి బౌన్సర్లను నియమిస్తుంటారు.అలాగే, ప్రైవేట్, వ్యక్తిగత సెక్యూరిటీగా కూడా బౌన్సర్లను నియమించుకుంటూ ఉంటారు కొందరు. రాజ్యాంగ పరంగా చట్టబద్ధంగా ఎన్నికైన వారికి ప్రభుత్వమే భద్రత కల్పిస్తూ ఉంటుంది. వారికి కావాల్సిన సెక్యూరిటీ అంతా ప్రభుత్వమే చూసుకుంటుంది. కానీ, సమాజంలో కాస్త హోదా, పలుకుబడి ఉన్న వ్యక్తులు ప్రైవేట్‌గా బౌన్సర్లు, బాడీగార్డుల రూపంలో సెక్యూరిటీని నియమించుకుంటూ ఉంటారు.వీరిలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు, వ్యాపారవేత్తలు, క్రికెటర్లు, ఇతర సెలబ్రిటీలు ఉంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే…బౌన్సర్లు, బాడీగార్డులనే వారు వ్యక్తులకు భద్రత కల్పించేవారన్నమాట.ఉదాహరణకు.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు కూడా అధికారంలోకి రాక ముందు బౌన్సర్లు, బాడీగార్డుల రూపంలో సెక్యూరిటీ ఉండేవారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
MLAకు లడ్డూలు.. ఫ్రూట్స్ తో తులాభారం
ఇంటి తాళం చెప్పుల స్టాండ్‌లో పెడుతున్నారా.. జాగ్రత్త..
33 గంటలు… నిర్విరామంగా హనుమాన్ చాలీసా పారాయణం
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం !! దీనివల్ల అమెరికన్లపై చాలా భారం
ఆట అనుకున్నాడు.. అమ్మనే కోల్పోయాడు