సంగం నోస్‌ ఘాట్‌ వద్దే తొక్కిసలాటకు కారణమేంటి ??

Updated on: Jan 31, 2025 | 5:20 PM

మహాకుంభమేళాలో సంగం నోస్‌ అనే ఘాట్‌ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక తొక్కిసలాట జరగడంతో ఈ ఘాట్‌ వద్దే జనం ఎందుకు ఎక్కువగా పోగుయ్యారు? అసలు ఈ ఘాట్‌ విశేషాలు ఏంటీ? అనేవి ఇప్పుడు చర్చనీయాంశాలు అయ్యాయి. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమ స్థలిగా చెబుతారు.

సంగం నోస్‌ వద్ద వేర్వేరుగా వచ్చి గంగా, యమునా నదీ ప్రవాహాలు ఒక్కటిగా కలిసిపోయి ముందుకుసాగడం చూడొచ్చు. ఇక్కడ రెండు నదులు వేరువేరు రంగులలో కనిపిస్తాయి. యమునా నదీజలాలు లేత నీలం రంగులో, గంగాజలం కొద్దిగా బురదమయంగా కనిపిస్తుంది. యమునా నది ఇక్కడ గంగానదిలో కలిసి అంతర్థానమవుతుంది. అంతర్వాహినిగా సరస్వతి నది సైతం సంగమించే ఈ ప్రాంతాన్నే కుంభమేళాలోని ప్రధాన సంగం ఘాట్‌గా చాలా మంది భావిస్తారు. వివిధ సంప్రదాయాలకు చెందిన అఖాడా సాధువులు తమ ఆచారాలు, అమృత స్నానాలను సంగం నోస్‌ వద్దే ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. శతాబ్దాల క్రితం జనాభా తక్కువ. అందులోనూ ఈ స్థాయిలో భక్తజనకోటి లేదు. కాబట్టి ఆనాడు కుంభమేళాకు విచ్చేసిన భక్తులంతా కేవలం ఈ త్రివేణి సంగమ స్థలి వద్దే పవిత్ర స్నానాలు ఆచరించేవారని స్థానికులు చెబుతున్నారు. దీంతో తాము కూడా ఈ సంగం నోస్‌ వద్దే పుణ్నస్నానాలు ఆచరించాలని ఈ విషయం తెల్సిన చాలా మంది భక్తులు భావిస్తారు. వాస్తవానికి 4,000 హెక్టార్లలో విస్తరించిన ఘాట్‌లలో సంగం నోస్‌ కూడా ఒకటి. సంగం నోస్‌ వద్ద ఎక్కువ మంది స్నానాలు ఆచరించడానికి వీలుపడదు. కానీ జనం ఇక్కడే ఎక్కువగా స్నానాలు చేసేందుకు ఆసక్తి చూపడంతో యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒడ్డు వెంట ఇసుక బస్తాలు వేసి, డ్రెడ్జింగ్‌ చేసి ఎక్కువ మంది కొనదాకా వచ్చి స్నానాలు చేసేలా దీనిని పెద్ద ఘాట్‌గా మార్చారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుంభమేళాలో ఏం జరుగుతోంది ?? యోగీ మాస్టర్ స్కెచ్ ఇదేనా..

సునీతా విలియమ్స్.. ఫిబ్రవరిలోనైనా తిరిగొస్తారా ??

గోల్డ్‌ పెట్టి లోన్‌ తీసుకుంటున్నారా ?? మీ ఒరిజినల్‌ గోల్డ్‌ సేఫేనా ??

15 రోజుల్లో 10 కేజీల బరువు తగ్గాడు.. చివరకు ఇలా అయ్యాడు!

మీ ఊరిలో కరెంటు పోతే.. వెంటనే ఈ నెంబర్‌కు కాల్‌ చేయిండి