కుంభమేళాలో ఏం జరుగుతోంది ?? యోగీ మాస్టర్ స్కెచ్ ఇదేనా..

Updated on: Jan 31, 2025 | 5:19 PM

ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళాలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందారు. తాజాగా కుంభమేళాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మహాకుంభమేళా ప్రాంతంలోని సెక్టార్-22లో మంటలు చెలరేగాయి. అనేక టెంట్‌లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది.

మంటలు చెలరేగిన స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణమేమిటన్నది తెలియరాలేదు. జనవరి 19వ తేదీన కూడా గ్యాస్ సిలిండర్స్ పేలి కుంభమేళాలో అగ్ని ప్రమాదం జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా బుధవారం తెల్లవారుజూమున తొక్కిసలాట జరిగింది. ఇందులో 30 మంది మరణించినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కుంభమేళాలో తొక్కిసలాటపై ప్రస్తుతం విచారణ జరుగుతుండగా.. యూపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్య ఘాట్‌ల దగ్గర రనిద్దీ తగ్గించేందుకు ఐదు కీలక మార్పులు చేశారు సీఎం యోగి. కుంభమేళా జరుగుతున్న ప్రాంతాన్ని ఫిబ్రవరి 4 వరకు ‘నో వెహికల్’ జోన్‌గా ప్రకటించారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు రోడ్లను వన్ వేగా మార్చారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సునీతా విలియమ్స్.. ఫిబ్రవరిలోనైనా తిరిగొస్తారా ??

గోల్డ్‌ పెట్టి లోన్‌ తీసుకుంటున్నారా ?? మీ ఒరిజినల్‌ గోల్డ్‌ సేఫేనా ??

15 రోజుల్లో 10 కేజీల బరువు తగ్గాడు.. చివరకు ఇలా అయ్యాడు!

మీ ఊరిలో కరెంటు పోతే.. వెంటనే ఈ నెంబర్‌కు కాల్‌ చేయిండి