What India Thinks Today: టెక్నాలజీ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలి – కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

|

Feb 26, 2024 | 3:59 PM

సాంకేతిక పరిజ్ఞానమనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండటమే కాదు అది సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచననని కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. టీవీ నైన్‌ నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక వాట్‌ ఇండియా థింక్స్‌ టుడే సదస్సులో అశ్విని వైష్ణవ్‌ పాల్గొన్నారు. ముంబయిలో ఉండే వ్యక్తికి ఎలాగైతే టెక్నాలజీ అందుబాటులో ఉంటుందో అదే టెక్నాలజీ కేరళలోని జలాలల్లో ఉండేవారికి..

సాంకేతిక పరిజ్ఞానమనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండటమే కాదు అది సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచననని కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. టీవీ నైన్‌ నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక వాట్‌ ఇండియా థింక్స్‌ టుడే సదస్సులో అశ్విని వైష్ణవ్‌ పాల్గొన్నారు. ముంబయిలో ఉండే వ్యక్తికి ఎలాగైతే టెక్నాలజీ అందుబాటులో ఉంటుందో అదే టెక్నాలజీ కేరళలోని జలాలల్లో ఉండేవారికి, ఝార్ఖండ్‌లో మారుమూల ప్రాంతాల్లో ఉండేవారికి అందుబాటులో ఉండేలా UPI సిస్టమ్‌ డిజైన్‌ చేశామని తెలిపారు. ఈ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని, ప్రపంచం దీన్ని ప్రశంసిస్తోందని వైష్ణవ్‌ వెల్లడించారు. రైల్వేశాఖ సాధిస్తున్న ప్రగతిని కూడా అశ్వినీ నైష్ణవ్‌ వివరించారు.

భారత్ ఆలోచనలు, ఆకాంక్షలను టీవీ9 శిఖరాగ్ర సదస్సు Live కోసం ఇక్కడ క్లిక్ చేయండి…