Tirumala: తిరుమల కొండపై నీటి కష్టాలు.! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా.!
తిరుమలలో నీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో తిరుమలలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా కరవు ఛాయలు అలముకున్నాయి. శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతీరోజూ 70,000 మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తోండటం, బ్రహ్మోత్సవాలు సమీపిస్తోండటం వంటి పరిస్థితుల్లో నీటి ఎద్దడి ఏర్పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తిరుమల కొండపై భక్తులు, స్థానికులు నీటిని పొదుపుగా..
తిరుమలలో నీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో తిరుమలలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా కరవు ఛాయలు అలముకున్నాయి. శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతీరోజూ 70,000 మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తోండటం, బ్రహ్మోత్సవాలు సమీపిస్తోండటం వంటి పరిస్థితుల్లో నీటి ఎద్దడి ఏర్పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తిరుమల కొండపై భక్తులు, స్థానికులు నీటిని పొదుపుగా వినియోగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు బుధవారం (ఆగస్టు 21) ఒక ప్రకటనలో కోరింది. నీటి పొదుపునకు సంబంధించిన నిబంధనలను విడుదల చేసింది. తిరుమలలో స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్ ప్రాంతానికి ఇకపై 6 రోజులకు ఒకసారి నీటి సరఫరా ఉంటుందని తెలిపింది. వ్యాపార సముదాయాలకు ఇకపై 24 గంటల నీటి సరఫరా ఉండదని.. రోజులో ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు మాత్రమే నీటి సరఫరా ఉంటుందని టీటీడీ పేర్కొంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు మొత్తం కలిపి రోజులో 8 గంటలు మాత్రమే వ్యాపార సముదాయాలకు నీటి సరఫరా చేస్తామని తెలిపింది. ఆగస్టు 25 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. వ్యాపార సముదాయాలకు ఈ పరిధికి మించి నీటి అవసరం ఉంటే, తిరుపతి నుంచి ట్యాంకర్ల ద్వారా తెప్పించుకోవాలని.. ఇందుకోసం విజిలెన్స్ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని టీటీడీ సూచించింది. తిరుమలలో స్థానికులు,...