రోజుకు పది వేల అడుగులు అక్కర్లేదట !! మరి ఎన్ని అడుగులు చాలు ??

|

Oct 03, 2024 | 9:21 PM

ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అందరూ దృష్టి పెడుతున్నారు. అందుకోసం వర్కవుట్లు, ఎక్సర్‌సైజులు చేస్తున్నారు. ఇలాంటివి చేయలేనివారు వాకింగ్‌తో సరిపెట్టుకుంటున్నారు. అయితే మనం ఆరోగ్యంగా ఉండటానికి రోజుకి కనీసం 10 వేల అడుగులైనా వేస్తే కానీ సాధ్యం కాదని చెబుతారు. కానీ లేటెస్ట్ పరిశోధనల ప్రకారం రోజుకి 4 వేల అడుగులు వేసినా చాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఆపై మనం వేసే ప్రతి అడుగూ ఆరోగ్య ప్రయోజనాలని పెంచుతూ వెళ్తుందని అంటున్నారు లాడ్జ్‌ మెడికల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.

ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అందరూ దృష్టి పెడుతున్నారు. అందుకోసం వర్కవుట్లు, ఎక్సర్‌సైజులు చేస్తున్నారు. ఇలాంటివి చేయలేనివారు వాకింగ్‌తో సరిపెట్టుకుంటున్నారు. అయితే మనం ఆరోగ్యంగా ఉండటానికి రోజుకి కనీసం 10 వేల అడుగులైనా వేస్తే కానీ సాధ్యం కాదని చెబుతారు. కానీ లేటెస్ట్ పరిశోధనల ప్రకారం రోజుకి 4 వేల అడుగులు వేసినా చాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఆపై మనం వేసే ప్రతి అడుగూ ఆరోగ్య ప్రయోజనాలని పెంచుతూ వెళ్తుందని అంటున్నారు లాడ్జ్‌ మెడికల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. కుర్చీలకే పరిమితం అయిపోతున్నాం… పదివేల అడుగులు వేయలేకపోతున్నామే అని బాధపడేవారికి ఇది కొంత ఊరట కలిగించే అంశమే. సుమారు రెండున్నర లక్షలమందిపైన పరిశోధన చేసిన తరువాత శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలివి. రోజూ రెండున్నరవేల అడుగులు వేసే వారిలో గుండెజబ్బులు దూరంగా ఉంటాయట. అదే నాలుగువేల అడుగులు వేయగలిగితే అన్నిరకాల జబ్బుల నుంచీ దూరంగా ఉండొచ్చంటున్నారు. ఆపైన వెయ్యి అడుగులు వేస్తే ఈ ప్రయోజనాలు మరో 15 శాతం పెరుగుతాయట. ఇంకో 500 అడుగులు వేయగలిగితే దాదాపుగా గుండెజబ్బుల నుంచి రక్షణ ఉన్నట్టేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే నడక సర్వరోగ నివారిణి ఈపాటికి అందరికీ అర్ధమై ఉంటుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రీల్స్‌ కోసం ఇదేం పిచ్చిరా సామీ.. పట్టు తప్పితే ప్రాణాలు గాల్లోనే !!

ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా

కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి

గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు

ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు

Follow us on