విజువలైజేషన్ టెక్నిక్‌తో భయాలు దూరం

Updated on: Nov 02, 2025 | 1:56 PM

చేయాల్సిన పనులు, చేరాల్సిన గమ్యాలు ఎన్నో. అయితే చాలా మంది సాధించగలమో లేదో అన్న సంశయంతో ముందడుగేయరు. అలాంటి వారికి విజువలైజేషన్ టెక్నిక్‌ ఒక సక్సెస్ టూల్‌గా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. విజువలైజేషన్ మెదడును ప్రభావితం చేసి ఆలోచనలను సానుకూలంగా మలచడంలో కీ రోల్ పోషిస్తుంది. అంటే ఇది మెదడు పనితీరును మార్చే మెంటల్ రిహార్సల్ అని చెప్పవచ్చు.

ఒక పని చేయాలంటే భయపడే స్థానంలో మీలో ఆత్మ విశ్వాసం నింపి, సక్సెస్ వైపు నడిపించడంలో గైడ్‌లా పనిచేస్తుంది. మీకు ట్రైన్‌ జర్నీ అంటే భయమా? అయితే కళ్లు మూసుకొని ట్రైన్‌లో మీకు ఇష్టమైన ప్రాంతానికి వెళ్లినట్లు, ప్రయాణం సాఫీగా సాగినట్లు, సంతోషంగా గడిపినట్లు ఊహించుకోండి. ఇలా రోజూ కొద్దిసేపు ప్రాక్టీస్ చేస్తే మీలోని భయం పోతుంది. మరోసారి జర్నీ చేసినప్పుడు ముందు ఊహించుకున్నట్లే మీ ప్రయాణం సంతోషంగా సాగుతుంది. ఎందుకంటే దటీజ్ ద పవర్‌ ఆఫ్‌ విజువలైజేషన్ అంటున్నారు నిపుణులు. ఇది కేవలం ఒక్క జర్నీ విషయంలోనే కాదు, జీవితంలోని అనేక విషయాలకు వర్తిస్తుందట. ఉద్దేశపూర్వకంగా సానుకూల, వివరణాత్మక దృశ్యాలను ఊహించాలి. మీరు ఏం చేస్తారు? ఎలా ఫీల్ అవుతారనే విషయాలను స్పష్టంగా ఊహించడం ద్వారా, మీ మెదడుకు ఒక స్క్రిప్ట్ ఇచ్చినట్లవుతారు. అది సవాళ్లను మరింత సులభంగా ఎదుర్కొనేలా, తక్కువ ఒత్తిడిగా మార్చడంలో సహాయపడుతుంది. విజువలైజేషన్ టెక్నిక్‌ను రోజూ కొద్ది నిమిషాలు ప్రాక్టీస్ చేయడం ద్వారా, మెదడుకు పలు విషయాల్లో నెగెటివ్‌ దృక్పథం నుంచి సానుకూల ఫలితాల కోసం శిక్షణ ఇవ్వచ్చు. ఉదాహరణకు, ఒక ప్రెజెంటేషన్ లేదా పరీక్షకు ముందు, దానిని విజయవంతంగా పూర్తి చేసిన దృశ్యాన్ని ఊహించడం మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. విజువలైజేషన్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ, ఒత్తిడిని తగ్గించి, లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రీల్స్ చేయాలంటే డిగ్రీ ఉండాల్సిందే.. లేదంటే రూ లక్షల్లో ఫైన్‌!

అంతా బాగుంది.. కానీ క్రెడిట్ స్కోర్ పెరగటం లేదు.. ఎందుకిలా ??

చెట్లు ఎక్కే పాములు.. ఎక్కడో కాదు.. మన కోనసీమలోనే..