ఆ కీచక తండ్రికి చచ్చే వరకు జైలు శిక్ష.. పోక్సో కేసులో సంచలన తీర్పు

Updated on: Oct 01, 2025 | 4:41 PM

విశాఖపట్నంలో ఓ కీచక తండ్రికి కోర్టు మరణించే వరకు జైలు శిక్ష విధించింది. పొక్సో కేసులో న్యాయస్థానం సంచలనం తీర్పు వెల్లడించింది. నాలుగేళ్ల కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన కన్న తండ్రికి కఠిన శిక్ష విధించింది. ఈ ఏడాది ఏప్రిల్ 15న భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియ‌ని నాలుగేళ్ల కుమార్తెపై క‌న్న‌తండ్రే అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు.

నిందితుడిపై పోక్సో కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ చేపట్టారు. నిందితుడికి భార్య‌, నాలుగేళ్ల కుమార్తె, ఆరేళ్ల‌ కుమారుడు ఉన్నారు. భార్యతో గొడవ కారణంగా కొంత కాలంగా ఆ వ్యక్తి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. కుమార్తె నిద్ర‌పోతుండ‌గా మ‌ద్యం మ‌త్తులో ఉన్న తండ్రి విచ‌క్ష‌ణ మ‌రిచి త‌న నాలుగేళ్ల బాలిక‌పై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. దీంతో బాలిక బిగ్గ‌ర‌గా ఏడుస్తూ కేక‌లు వేసింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించారు. దీంతో కీచక తండ్రికి కోర్టు కఠిన శిక్ష విధించింది. నిందితుడు మరణించే వరకు జైలు శిక్ష అనుభవించాలని న్యాయస్థానం సంచలనం తీర్పు వెల్లడించింది. కోర్టు తీర్పు పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మా సినిమాల మీద మీ పెత్తనం ఏంటి ??

బంగారు ఆభరణాలకు మెరుగుపెడతామంటూ వచ్చి.. చివరికి

రాబోయే పదేళ్లలో ఉద్యోగాల స్వరూపంలో రానున్న పెను మార్పులు

కొత్త ఇంటి ఈఎంఐ కట్టడానికి ఖతర్నాక్‌ ఐడియా

అది నీ పిల్ల కాదే.. నా పిల్ల.. కుక్కపిల్లను ఎత్తుకెళ్లిన కోతి