ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రాక!
విశాఖపట్నం–బెంగళూరు మధ్య ప్రయాణికులకు దక్షిణ తీర రైల్వే కీలక ప్రతిపాదన సిద్ధం చేసింది. రెండు నగరాల మధ్య కొత్త వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు సమగ్ర నివేదికను రైల్వే బోర్డుకు పంపింది. ప్రస్తుతం 17 నుంచి 21 గంటలు పడుతున్న ప్రయాణ సమయం ఈ రైలుతో 15 గంటలలోపే తగ్గే అవకాశం ఉంది. వారానికి ఆరు రోజులు 20 కోచ్‌లతో సర్వీసు నడపాలని ప్రతిపాదించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, ఐటీ రాజధాని బెంగళూరు మధ్య ప్రయాణించే ప్యాసింజర్లు, ఉద్యోగులకు దక్షిణ తీర రైల్వే తీపి కబురు అందించింది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించేందుకు కొత్తగా ‘వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్’ రైలును నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు సమగ్ర నివేదికను తుది ఆమోదం కోసం రైల్వే బోర్డుకు పంపింది. ప్రస్తుతం వైజాగ్ – బెంగళూరు మధ్య నడిచే సాధారణ రైళ్లకు 17 నుంచి 21 గంటల సమయం పడుతోంది. అయితే, ఈ కొత్త వందే భారత్ స్లీపర్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం కేవలం 15 గంటల కంటే తక్కువకే తగ్గిపోనుంది. వారంలో ఆరు రోజుల పాటు ఈ సర్వీసును నడపాలని ప్రతిపాదించారు. బెంగళూరులో రాత్రి 8:00 గంటలకు బయలుదేరే రైలు మరుసటి రోజు ఉదయం 10:00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో వైజాగ్‌లో రాత్రి 8:15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10:00 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ రైలు గుంటూరు, విజయవాడ, నంద్యాల, ధర్మవరం మీదుగా దాదాపు 1,061 కిలోమీటర్ల మేర సాగనుంది. మార్గమధ్యంలో కృష్ణా కెనాల్ జంక్షన్, దువ్వాడ వంటి కీలక స్టేషన్లలో స్టాప్‌లు ఉంటాయి. సాధారణంగా వందే భారత్ స్లీపర్ రైళ్లు 16 కోచ్‌లతో నడుస్తుండగా, ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఏకంగా 20 కోచ్‌ల భారీ రేక్‌తో నడపాలని నిర్ణయించారు. గంటకు 160 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటికీ, ట్రాక్ పరిస్థితుల దృష్ట్యా సగటున 75 కి.మీ వేగంతో నడపనున్నారు. విమాన ప్రయాణానికి ధీటుగా ఉండే ఈ స్లీపర్ రైలు ఐటీ నిపుణులకు, తెలుగు ప్రజలకు ఎంతో ఊరటనివ్వనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్లాస్టిక్ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్ నోట్లు బంద్?
అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!
డెన్మార్క్ రాజకుమారి సంచలనం.. రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!
మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు.. తప్పు ఎక్కడ జరుగుతోంది?
