ఫుడ్ పార్శిల్ ఇచ్చి.. ముద్దు పెట్టి మామ అనుకోమన్నాడు.. కట్ చేస్తే సీన్ సీతారే !!

|

Sep 27, 2022 | 8:57 PM

ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెడితే.. డెలివరీ బాయ్స్ సైలెంట్‌గా ఫుడ్ డెలివరీ చేసి పోతారనే నమ్మకమే పోతోంది జనాల్లో. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు ఈ భయాన్ని ప్రజల్లో రేకెత్తిస్తున్నాయి.

ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెడితే.. డెలివరీ బాయ్స్ సైలెంట్‌గా ఫుడ్ డెలివరీ చేసి పోతారనే నమ్మకమే పోతోంది జనాల్లో. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు ఈ భయాన్ని ప్రజల్లో రేకెత్తిస్తున్నాయి. తాజాగా జోమాటోకి చెందిన ఓ డెలివరీ బాయ్.. ఫుడ్ డెలివరీకి వచ్చి కస్టమర్‌కు బలవంతంగా ముద్దు పెట్టాడు. మహారాష్ట్రలోని పూణె యెవలేవాడిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. సెప్టెంబర్ 19న ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఓ యువతి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టింది. ఆ ఫుడ్‌ను జొమాటో డెలివరీ మ్యాన్ తీసుకువచ్చాడు. ఫుడ్‌ను ఆమెకు ఇచ్చాక ఆమెతో మాటలు కలిపి.. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్నాడు.. అదే ఛాన్స్‌గా భావించి.. అమ్మాయిని బలవంతంగా పట్టుకుని ముద్దు పెట్టాడు. చేసిన పనిని కవర్ చేసుకుంటూ మావయ్య అనుకోమంటూ జారుకున్నాడు. అంతటితో సమస్య ముగిసిందనుకుంటే.. జోమాటో మ్యాన్ మళ్లీ ఆ అమ్మాయి వాట్సప్‌కు మెసేజ్‌లు చేయడం మొదలుపెట్టాడు. దాంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కూతురి కోసం ఈ తండ్రి పెద్ద యుద్ధమే చేశాడుగా..

ఆదర్శ దంపతులు.. ఇది కదా భార్యభర్తల బంధం అంటే..

Viral: కుక్కను ఇంప్రెస్ చేయడానికి గొల్లభామ కష్టాలు..

సైలెంట్‌గా వెళ్లి గుడ్డును గుటుక్కున మింగింది.. ఆ తర్వాత దాని తిప్పలు చూడండి

అడవిలో సఫారికి వెళ్ళిన పర్యాటకులు.. ఒక్కసారిగా దూసుకొచ్చిన సింహం

 

 

Published on: Sep 27, 2022 08:57 PM