Zero Shadow day: నేడే జీరో షాడో డే.! సరిగ్గా ఆ టైం మీ నీడ మాయమవుతుంది.. మీరు చెక్ చెయ్యండి.

|

May 09, 2023 | 6:51 AM

హైదరాబాద్ లో మే 9న (నేడు) అద్భుతం ఆవిష్కృతం కానుంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు నగరంలో నీడ మాయం కానుంది. అంటే మన నీడ కనిపించదు. ఇలా జరగడాన్ని ‘జీరో షాడో డే’ అంటారు.

భాగ్యనగరంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. దీనిని ఎవరూ మిస్‌ చేయకండి. అవును మీ నీడ మాయం కానుంది. మీ నీడను మీరే చూడలేరు. మధ్యాహ్నం వేళ సూర్యుడి ప్రతాపం సమయంలో నీడ కనిపించడం లేదంటే అందరికి ఆశ్చర్యం గానే ఉంటుంది. అలాంటి అరుదైన దృశ్యం ఇటీవలే బెంగళూరులో చోటుచేసుకుంది. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లో కూడా నీడ పడని రోజు రానుంది. హైదరాబాద్ లో మే 9న అద్భుతం ఆవిష్కృతం కానుంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు నగరంలో నీడ మాయం కానుంది. అంటే మన నీడ కనిపించదు. ఇలా జరగడాన్ని ‘జీరో షాడో డే’ అంటారు. ఆ రోజున నగరంలో సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడతాయి. అప్పుడు ఎండలో నిటారుగా ఉంచిన వస్తువుల నీడ రెండునిమిషాలపాటు అంటే 12 గంటల 12 నిమిషాలనుంచి 12 గంటల 14 నిమిషాల వరకు కనిపించదని బీఎం బిర్లా సైన్స్ సెంటర్ టెక్నికల్ అధికారులు తెలిపారు. ఆ సమయంలో ఎండలో మనం నిల్చున్నా మన నీడ కనిపించదని పేర్కొన్నారు. అలాగే, ఆగస్టు 3న కూడా హైదరాబాద్‌లో ‘జీరో షాడో డే’ ఏర్పడుతుందని తెలిపారు. సమయంలో మార్పుల వల్ల దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ జీరో షాడో డే వస్తుందన్నారు. కాగా, ఇటీవల బెంగళూరులోనూ ఈ ఖగోళ అద్భుతం కనిపించింది. ఏప్రిల్ 25న మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాలకు ఎండలో ఉన్న వస్తువులు, మనుషుల నీడ మాయమైంది. ఈ అద్భుతాన్ని ఎవరూ మిస్ కావొద్దని చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!