YouTuber: వీళ్లు ఇక మారరా.! రూ.1.7 కోట్ల కారు.. ఫుల్ స్పీడ్‌లో డ్రైవింగ్.. చివరకు.?
సోషల్ మీడియా మాయలో పూర్తిగా కూరుకుపోయిన యువత తాము ప్రమాదంలో పడటమే కాకుండా ఇతరులనూ ప్రమాదంలో పడేస్తున్నారు. వ్యూసే లోకంగా బతుకుతూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా అమెరికాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. రూ.1.7 కోట్ల కారును నడుపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఓ యువ యూట్యూబర్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు.

జాక్ డోహర్టీ అనే 20 ఏళ్ల అమెరికా యూట్యూబర్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. అత్యంత సాహసోపేతమైన స్టంట్లకు అతడు బాగా పాప్యులర్ అయ్యాడు. ఇటీవల అతడు ఫ్లోరిడా రాష్ట్రంలో కారు డ్రైవ్ చేస్తూ లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. అది ఏకంగా 1.7 కోట్ల ఖరీదైన స్పోర్ట్స్ కారు. అప్పటికే అక్కడ రహదారులన్నీ వర్షం కారణంగా తడిగా ఉన్నాయి. అయితే, డోహర్టీ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా కారును ఫుల్ స్పీడ్‌లో డ్రైవ్ చేశాడు. పక్కనున్న అతడి సోదరుడు ఇదంతా లైవ్‌లో టెలికాస్ట్ చేయసాగాడు. కారును అంత ఫుల్ స్పీడులో తోలుతూనే డోహర్టీ తల వంచి ఫోన్‌లో వీడియో గేమ్ ఆడే ప్రయత్నం చేశాడు. కారు వేగంగా వెళుతున్నా జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో.. క్షణాల్లో రోడ్డు ప్రమాదం సంభవించింది.
రోడ్డంతా నీరు ఉండటంతో డోహర్టీ కారు క్షణాల్లో అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డోహర్టీకి ఏమీ కాకపోయినప్పటికీ అతడి సోదరుడికి మాత్రం తలకు దెబ్బతగలడంతో అతడి ముఖం రక్తసిక్తమైంది. ఈ దృశ్యాలన్నీ కూడా కెమెరాలో రికార్డయ్యాయి. ఘటన జరిగిన వెంటనే ఇతర వాహనదారులు అప్రమత్తమై ఆ అన్నాతమ్ముళ్లను సురక్షితంగా బయటకు తీశారు. ఇక యాక్సిడెంట్ ధాటికి కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయిపోయింది. గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయింది. అయితే, ఈ ఘటన నుంచి కాస్త కోలుకున్నాక డోహర్టీ ఈ వీడియో మొత్తాన్ని నెట్టింట పోస్టు చేయడంతో జనాల విమర్శలకు అంతేలేకుండా పోయింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.