Loading video

38 గంటలు కదలకుండా నిలబడ్డ యూట్యూబర్.. బుగ్గ గిల్లినా డిస్టర్బ్ కాలేదు వీడియో

|

Mar 21, 2025 | 12:49 PM

ఇంటర్నెట్‌లో రకరకాల ఛాలెంజ్‌లు వైరల్ అవుతుంటాయి. కొందరు ఫన్నీ ఛాలెంజ్‌లు చేస్తుంటే.. మరికొందరు తమ ఓపిక, పట్టుదలను పరీక్షించే అసాధారణమైన సాహసాలను చేస్తారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా యూట్యూబర్ ‘నార్మే’ ఏకంగా 38 గంటలు కదలకుండా నిలబడి ప్రపంచ రికార్డు సృష్టించాడు. నార్మే చేసిన ఈ సాహసం లైవ్‌స్ట్రీమ్‌లో చూసి ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆశ్చర్యపోయారు.

ఈ రికార్డు సాధించే క్రమంలో నార్మే ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నాడు. అతన్ని డిస్టర్బ్ చేయడానికి కొంతమంది ఫాలోవర్లు సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ మెసేజ్‌లు పంపించారు. ఇంకొందరు కావాలని ప్రాంక్స్ చేసి అతన్ని కదిలించడానికి ప్రయత్నించారు. 38 గంటల పాటు ఆయన ఒక్క అంగుళం కూడా కదలకుండా నిలబడి సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. ఇది సాధారణమైన పని కాదు. అంతసేపు శరీరాన్ని స్థిరంగా ఉంచడం చాలా కష్టం. అయినప్పటికీ, తన అద్భుతమైన సెల్ఫ్ కంట్రోల్‌తో నార్మే ఈ రికార్డును సాధించాడు. కొంతమంది అతని స్థితిని గమనించి పోలీసులకు ఫోన్ చేసి అలర్ట్ చేశారు. అయినప్పటికీ, నార్మే అస్సలు డిస్టర్బ్ కాలేదు. చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా ఒక విగ్రహంలా నిలబడి రికార్డును సృష్టించాడు. నార్మే చేసిన ఈ సాహసం కేవలం ఒక రికార్డే కాదు.. ఓపిక, పట్టుదల, మానసిక స్థైర్యానికి నిదర్శనం కూడా. ప్రస్తుత ఉరుకు పరుగుల ప్రపంచంలో ఏమీ చేయకపోవడమే ఒక్కోసారి పెద్ద ఛాలెంజ్. ఇది కేవలం శరీరానికే కాకుండా, మనసుకు కూడా పరీక్ష. అంతసేపు కదలకుండా నిలబడి ఉండటం కోసం బాడీని, మైండ్‌ను ప్రత్యేకంగా ట్రైన్ చేసుకోవాలి. డిస్ట్రాక్షన్స్‌ను పట్టించుకోకుండా ఉండేలా ఎంతో డిసిప్లిన్ అవసరం.

మరిన్ని వీడియోల కోసం :

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి ఏమైందంటే?

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..వీడియో

ఒక్క టూత్‌ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది