Viral Video: 100 మోమోస్ ఛాలెంజ్.. మరి ఆమె విజయం సాధించిందా ?? వీడియో
సాధారణంగా ఓ 10 మోమోస్ తింటే.. కడుపు నిండిపోతుంది. మళ్లీ అన్నం తినాలన్నా కష్టమే. కానీ.. ఓ యువతి మాత్రం ఏకంగా 100 మోమోస్ తినేందుకు చాలెంజ్‌ను స్వీకరించింది.
సాధారణంగా ఓ 10 మోమోస్ తింటే.. కడుపు నిండిపోతుంది. మళ్లీ అన్నం తినాలన్నా కష్టమే. కానీ.. ఓ యువతి మాత్రం ఏకంగా 100 మోమోస్ తినేందుకు చాలెంజ్‌ను స్వీకరించింది. అవి కూడా చికెన్ మోమోస్. ఆ యువతి ఒక యూట్యూబర్. తన పేరు మాధురి లహరి. తనకు మ్యాడీ ఈట్స్ అనే యూట్యూబ్ చానెల్ ఉంది. ఆ చానెల్‌లో ఇలా ఫుడ్‌కు సంబంధించిన వీడియోలు అప్‌లోడ్ చేస్తూ ఉంటుంది. 100 మోమోస్ తినేందుకు తెగ ప్రయత్నించింది కానీ.. 100 మోమోస్ తినలేకపోయింది. చివరకు ఓ 20 మోమోస్‌ను మిగిల్చినా.. 80 మోమోస్ తిని గ్రేట్ అనిపించుకుంది. ఈ చాలెంజ్ చేసి చాలా రోజులే అయినా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Published on: Jan 24, 2022 06:30 PM
