Viral Video: ఏం ట్యాలెంట్ సామీ.. ఈ డ్రైవరన్న ప్రతిభ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. వైరల్ వీడియో..
Viral Video: ఏమంటూ సోషల్ మీడియా విస్తృతి పెరుగుతుందో ఎక్కడెక్కడో జరుగుతున్న వింతలన్నీ అరచేతిలో వాలిపోతున్నాయి. ప్రపంచాన్ని తెలియని ఎంతో మంది ప్రతిభావంతులు, తమ ట్యాలెంట్‌ను చూపించుకుంటున్నారు. ఇన్ని రోజులు ఎవరికీ తెలియకుండా...

Viral Video: ఏమంటూ సోషల్ మీడియా విస్తృతి పెరుగుతుందో ఎక్కడెక్కడో జరుగుతున్న వింతలన్నీ అరచేతిలో వాలిపోతున్నాయి. ప్రపంచానికి తెలియని ఎంతో మంది ప్రతిభావంతులు, తమ ట్యాలెంట్‌ను చూపించుకుంటున్నారు. ఇన్ని రోజులు ఎవరికీ తెలియకుండా కనుమరుగైన ట్యాలెంట్‌ను అందరికీ చూపించుకునే అవకాశం లభిస్తోంది. ఇలా రోజులో ఎన్నో వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి కారు డ్రైవ్ చేస్తూ కొండ ప్రాంతంలో వెళుతున్నాడు. కారు సరిగ్గా ఘాట్ రోడ్డు మధ్యలో ఉంది. ఏమాత్రం వెనక్కి జరిగినా కొండపై నుంచి కారు పడిపోయే ప్రమాదం. పోనీ యూటర్నీ తీసుకుందామా అంటే పక్కన కొండ. అయినా ఆ డ్రైవర్ తగ్గేదేలా అన్నట్లు కారును అదే చిన్న స్థలంలో యూటర్న్ చేసేందుకు ప్రయత్నించాడు. సాధారణంగా ఇది అసాధ్యం. ఎట్టి పరిస్థితుల్లో కారును యూటర్న్‌చేయలేడు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు కాబట్టే ఇప్పుడా ఆ కారుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అంత చిన్న రోడ్డులోనే కారును ముందుకు, వెనక్కి తిప్పుతూ ఎట్టకేలకు యూటర్న్ చేసుకొని దూసుకుపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడీయో చూసిన నెటిజన్లు ఆ డ్రైవర్ ట్యాలెంట్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. వీడియోను డౌన్‌లోడ్ చేసి వాట్సాప్‌లో స్టేటస్‌లా పెట్టుకుంటున్నారు.
The perfect 80 point turn! pic.twitter.com/bLzb1J1puU
— Dr. Ajayita (@DoctorAjayita) January 23, 2022
Good Luck Sakhi Trailer: గుడ్ లక్ సఖి ట్రైలర్ వచ్చేసింది.. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడంటే..
Korean Mom and Dughter: కచా బాదమ్ సాంగ్ కు కొరియన్ తల్లి కూతురు ఫిదా.. డ్యాన్స్ వీడియో వైరల్..
