Viral: మూగజీవికి నడకనిచ్చిన యువకుడు.. ప్రమాదంలో గాయపడిన శునకం.
ప్రమాదంలో గాయపడి, నడవలేని స్థితికి చేరుకున్న మూగజీవికి సపర్యలు చేసి మానవత్వం చాటుకున్నాడు ఓ యువకుడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శునకానికి వైద్యం చేయించడమే కాకుండా దానిని సంరక్షిస్తున్న యువకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు స్థానికులు. రెండు నెలల క్రితం గుంటూరు అమరావతి రోడ్డులోని ద్వారకా నగర్ వద్ద ఒక వాహనం వీధి కుక్కను ఢీ కొట్టింది. అనంతరం ఓ ఆటో కుక్కపై నుండి దూసుకు పోయింది. ఈ ప్రమాదంలో కుక్క నడుము పూర్తిగా విరిగిపోయి కదల్లేని స్థితిలోకి వెళ్లిపోయింది.
ప్రమాదంలో గాయపడి, నడవలేని స్థితికి చేరుకున్న మూగజీవికి సపర్యలు చేసి మానవత్వం చాటుకున్నాడు ఓ యువకుడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శునకానికి వైద్యం చేయించడమే కాకుండా దానిని సంరక్షిస్తున్న యువకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు స్థానికులు. రెండు నెలల క్రితం గుంటూరు అమరావతి రోడ్డులోని ద్వారకా నగర్ వద్ద ఒక వాహనం వీధి కుక్కను ఢీ కొట్టింది. అనంతరం ఓ ఆటో కుక్కపై నుండి దూసుకు పోయింది. ఈ ప్రమాదంలో కుక్క నడుము పూర్తిగా విరిగిపోయి కదల్లేని స్థితిలోకి వెళ్లిపోయింది. అది గమనించిన స్థానిక యువకుడు బండ్లమూడి గోపాల క్రిష్ణ కుక్క పరిస్థితికి చలించిపోయాడు. వెంటనే ఆ శునకాన్ని పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ చక్రవర్తికి చూపించాడు. శునకానికి చికిత్స చేసిన ఆయన ఫిజియోథెరపీ చేస్తే కుక్క తిరిగి నడవగలుగుతుందని తెలిపారు.
అప్పటినుంచి స్వయంగా యువకుడే ప్రతిరోజూ ఫిజియోథెరపి చేస్తున్నాడు. అంతేకాదు.. ఆ కుక్కను ఎలాగైనా నడిపించాలనుకున్న ఆ యువకుడు రెండు చక్రాల బండిని కుక్కకు అమర్చాడు. దాంతో ఆ శునకం చక్రాలబండిని ఆధారంగా చేసుకొని నడవడం మొదలు పెట్టింది. అయితే పూర్తిగా కోలుకోవటానికి మరికొంత సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. అప్పటి వరకూ దాని ఆలనా పాలనా తనే చూస్తానని గోపాల క్రిష్ణ తెలిపాడు. మొదట శునకం పరిస్థితి చూసి జాలి వేసిందని, ఎలాగైనా శునకాన్ని కాపాడాలనుకొని ఇలా చేస్తున్నట్టు గోపాలకృష్ణ తెలిపాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.