Viral Video: నడుస్తున్న రైలునుంచి దూకేసిన యువతులు.. ఏంజరిగిందో తెలిస్తే షాక్ అవుతారు..

Viral Video: నడుస్తున్న రైలునుంచి దూకేసిన యువతులు.. ఏంజరిగిందో తెలిస్తే షాక్ అవుతారు..

Anil kumar poka

|

Updated on: May 06, 2022 | 7:59 PM

కదులుతున్న రైల్లోనుంచి ముగ్గురు అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు కిందకు దూకేశారు. అది గమనించిన హోం గార్డ్‌ వెంటనే అప్రమత్తమయ్యాడు. లేకపోతే జరగకూడనిదే జరిగిపోయేది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది..


కదులుతున్న రైల్లోనుంచి ముగ్గురు అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు కిందకు దూకేశారు. అది గమనించిన హోం గార్డ్‌ వెంటనే అప్రమత్తమయ్యాడు. లేకపోతే జరగకూడనిదే జరిగిపోయేది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.. ముంబైలోని జోగేశ్వరి రైల్వే స్టేషన్‌లో ఏప్రిల్ 16న ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ రైలు వచ్చి ప్లాట్‌ఫారమ్‌పై ఆగింది. కాసేపటికి మళ్లీ కదిలేందుకు సిద్ధమైంది. మెల్లగా కదులుతున్న సందర్భంలో ఉన్నట్టుండి ఓ యువతి ప్లాట్‌ఫారమ్‌ మీదకు జంప్ చేసింది. ఈ క్రమంలో అదుపుతప్పి రైలు కింద పడబోయింది. అదే బోగీలో ఉన్న హోంగార్డు యువతిని గమనించి, వెంటనే తానూ కిందకు దూకి యువతిని పక్కకు లాగేశాడు. ప్రాణాపాయం తప్పడంతో అక్కడున్న ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలోనే మరో ఇద్దరు యువతులు కూడా ఒకరి తర్వాత ఒకరు కిందకు దూకేశారు.ఈ ప్రమాదంలో ముగ్గురు యువతులూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి, యువతి ప్రాణాలను కాపాడిన హోంగార్డును అంతా అభింనదించారు. ఈ ఘటన మొత్తం ప్లాట్‌ఫారమ్‌పై అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియోను ముంబై రైల్వే పోలీస్ కమిషనర్ కుషెర్ ఖలీద్.. తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేశారు. హోంగార్డును అభినందిస్తూనే.. రైలు కదులుతున్న సమయంలో ప్రయాణికులు ఇలా చేయడం ప్రమాదకరమంటూ సూచించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు హోంగార్డును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Syllabus Pattu Job Kottu: పోలీస్‌ జాబ్‌ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..

Wedding Viral Video: సన్నికల్లు తొక్కమంటే.. ఏకంగా పెళ్లికూతురినే..! నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో..

Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..

Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైనే మొదలెట్టేశారు.. పోటాపోటీగా వినూత్న ప్రయోగం..

Published on: May 06, 2022 07:59 PM