Woman Misbehaving: తప్పతాగి లోకల్ ట్రైన్‌లో రెచ్చిపోయిన యువతి.. ఏంచేసిందో చూడండి.. ట్రేండింగ్ వీడియో.
ముంబై లోకల్ ట్రైన్‌లో ఇద్దరు ప్రయాణీకులు తోటి ప్రయాణికుడి పట్ల దురుసుగా ప్రవర్తించారు. స్నేహితుడితో కలిసి లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న యువతి తనకు ఎదురుగా ఉన్న సీటుపై కాలు పెట్టి కూర్చుంది.
ముంబై లోకల్ ట్రైన్‌లో ఇద్దరు ప్రయాణీకులు తోటి ప్రయాణికుడి పట్ల దురుసుగా ప్రవర్తించారు. స్నేహితుడితో కలిసి లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న యువతి తనకు ఎదురుగా ఉన్న సీటుపై కాలు పెట్టి కూర్చుంది. ఆమె కాళ్లు పెట్టిన సీటులోనే ప్రశాంత్ అనే యువకుడు కూర్చుని ఉన్నాడు. ఈ క్రమంలో ఆమెను కాలు తీయాలని కోరాడు. అందుకు సదరు యువతి, ఆమె స్నేహితుడు నిరాకరించారు. అంతేకాదు, మా యిష్టం..నువ్వెవరు అడగటానికి.. మేము లాయర్లం తెలుసా అంటూ బెదిరించింది. ఈ వీడియోను ఫొటో జర్నలిస్ట్ ప్రసాద్ ట్విట్టర్‌లో షేర్ చేయడంతో పాటు ముంబై పోలీసులు, రైల్వే అధికారులను ట్యాగ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన ముంబై పోలీసులు కామెంట్స్ సెక్షన్లో ముంబై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ట్యాగ్ చేశారు. ఈ వీడియోచూసి, యువతి తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. యువతి తీరు సరికాదని, వీరిని ట్రైన్‌లో ప్రయాణించకుండా నిషేధించాలని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

