Viral Video: లుంగీ కట్టి పుష్ప సామీ పాటకు స్టెప్స్ అడగరగొట్టింన యువతి.. వీడియో
పుష్ప ఫీవర్ జనాలను ఇంకా వదల్లేదు. సినీ అభిమానులు ఇంకా పుష్ప పాటలనే తలుచుకుంటున్నారు. పుష్ప సినిమా పాటలకు సామాన్యులనుంచి సెలబ్రిటీల వరకు తమదైన స్టయిల్లో స్టెప్పులేస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు.
పుష్ప ఫీవర్ జనాలను ఇంకా వదల్లేదు. సినీ అభిమానులు ఇంకా పుష్ప పాటలనే తలుచుకుంటున్నారు. పుష్ప సినిమా పాటలకు సామాన్యులనుంచి సెలబ్రిటీల వరకు తమదైన స్టయిల్లో స్టెప్పులేస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా సామీ సామీ సాంగ్‌లో అల్లు అర్జున్ వేసిన లుంగీ స్టెప్స్‌ను ఓ యువతి అచ్చుగుద్దేసినట్టు దింపేసింది. సేమ్ టు సేమ్ అల్లు అర్జున్ కాస్టూమ్స్‌తో డ్యాన్స్ వేసింది. లుంగీ కట్టుకొని అల్లు అర్జున్ స్టెప్స్ వేసి ఆ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. అబ్బ.. అచ్చుగుద్దినట్టు పుష్పను దించేశావ్.. సేమ్ అల్లు అర్జున్‌లా డ్యాన్స్ చేశావు. సూపర్బ్ అంటూ యువతిని తెగ పొగిడేస్తున్నారు. ఇంకెందుకాలస్యం…ఆ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.