కొడుకు మృతిని తట్టుకోలేక ప్రాణం విడిచిన తండ్రి..

Updated on: Nov 11, 2025 | 3:03 PM

యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. విదేశాల్లో పనిచేస్తున్న కుమారుడు మహేంద్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లో మరణించాడు. అంత్యక్రియలు జరుగుతుండగా తండ్రి ప్రభాకర్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరాడు. కొడుకు మరణవార్త తెలిసిన వెంటనే తండ్రి షాక్‌కు గురై మృతి చెందాడు. రెండు రోజుల వ్యవధిలో తండ్రీకొడుకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

తమ సంతానాన్ని… అడ్డాల నాడే కాదు.. గడ్డాలు నాడు కూడా పిల్లలుగానే తల్లిదండ్రులు భావిస్తుంటారు. వారు ఎంత ఎత్తుకు ఎదిగినా.. తల్లిదండ్రుల దృష్టిలో పిల్లలుగానే కనిపిస్తుంటారు. తమ పిల్లలకు ఏమైనా అయితే తట్టుకోలేక విలవిలాడుతుంటారు. ఈ క్రమంలో.. అనారోగ్యం బారిన పడిన కొడుకు మృతిని తట్టుకోలేక తండ్రి కూడా ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో జరిగింది. జలాల్ పూర్ కు చెందిన గడ్డం ప్రభాకర్, సుజాత దంపతులకు కుమార్తె ముగ్గురు కొడుకులు ఉన్నారు. కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉన్నంతలో పిల్లలను చదివించి పెళ్లిళ్లు చేశారు. పిల్లాపాపలతో సంతోషంగా ఉన్నారు. ప్రభాకర్ చిన్న కొడుకు మహేంద్ర నాథ్ ఉన్నత చదువులు చదివి విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశాడు. మహేంద్ర నాథ్ కు భార్య, కుమార్తె ఉన్నారు. అనారోగ్యం బారిన పడిన మహేంద్రనాథ్‌ హైదరాబాద్ కు తిరిగి వచ్చి.. ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదే సమయంలో గత నెల 30వ తేదీన ప్రభాకర్, సుజాత దంపతులు బంధువుల ఇంట్లో ఫంక్షన్ కు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తున్నారు. మార్గమధ్యలో వీరి బైక్ కు కోతులు అడ్డు రావడంతో ఇద్దరూ బైక్ మీది నుంచి కింద పడ్డారు. ఈ ఘటనలో ప్రభాకర్ తలకు తీవ్రగాయం కావటంతో హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే.. ఆ సమయంలోనే చిన్న కుమారుడు మహేంద్ర ఆరోగ్యం పూర్తిగా దిగజారి.. ఆసుపత్రిలోనే చనిపోయాడు. అయితే.. ఈ విషయాన్ని చెబితే ప్రభాకర్ తట్టుకోలేడనే ఉద్దేశంతో.. ఆయనకు చెప్పకుండానే..బంధువులు, కుటుంబ సభ్యులు కలిసి ఇంటిదగ్గర మహేంద్ర అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే.. ఆసుపత్రిలో ఉన్న ప్రభాకర్.. తన కొడుకు ఆరోగ్యం గురించి ఆరా తీయటం, ఈ క్రమంలోనే చిన్న కొడుకు చనిపోయాడని తెలుసుకొని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రభాకర్ చికిత్స పొందుతూ చనిపోయాడు. తండ్రీ, కొడుకు రెండు రోజుల వ్యవధిలో మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కుమారుడి అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజే.. అదో చోట తండ్రి అంత్యక్రియలు నిర్వహించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారత్‌పై లానినా ఎఫెక్ట్‌.. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయే ఛాన్స్‌

యాదాద్రీశుడికి భారీ ఆదాయం.. ఒక్కరోజు హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

ముగింపు దిశగా అమెరికా షట్‌డౌన్.. ఊపిరి పీల్చుకున్న అమెరికన్లు

వరుస తుఫాన్‌లతో ఫిలిప్పీన్స్‌ అతలాకుతలం

స్పైస్‌జెట్ విమానానికి తప్పిన పెను ప్రమాదం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్